నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని లక్ష్మీ 70ఎంఎం థియేటర్లో మహర్షి చిత్ర బృందం సందడి చేసింది. పుట్టి పెరిగిన ఊరిలో, సొంత సినిమా హాల్లో రైతుల సమస్యపై తీసిన చిత్రాన్ని గ్రామస్థులతో కలిసి చూడటం ఆనందంగా ఉందని దర్శకుడు పైడిపల్లి వంశీ హర్షం వ్యక్తం చేశారు. యువ రైతులను చిత్ర బృందం సన్మానించింది. రైతుల కోసం ఉచితంగా సినిమా ప్రదర్శించారు. తన చిన్నతనం మొత్తం ఇదే సినిమా హల్లో గడిచిందని ఆనాటి అనుభవాలను వంశీ గుర్తు చేసుకున్నారు. తాను దర్శకుడు కావడానికి బీజం పడటానికి కారణం ఈ సినిమ హాలేనని వంశీ తెలిపారు. ఈ గ్రామాన్ని ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. మహర్షి చిత్రాన్ని ఆదరించి ఇంత విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఙతలు తెలిపారు.
ఇవీ చూడండి: రూ.175కోట్లు దాటిన మహేశ్ 'మహర్షి'