ఓ వైపు ఐపీఎల్, మరో వైపు పరీక్షలు. ఈ రెండు చాలవన్నట్లు మండే ఎండలు. వీటన్నింటి నుంచి సేద తీర్చేందుకు సినిమాలు విడుదల అవుతున్నాయి. టాలీవుడ్లో 'సూర్యకాంతం'.. బాలీవుడ్ నుంచి 'నోట్‌బుక్', 'జంగ్లీ'.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అల్లరి అమ్మాయి ఈ 'సూర్యకాంతం'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మెగా డాటర్ నిహారిక హీరోయిన్గా నటించిన మూడో సినిమా 'సూర్యకాంతం'. ఇప్పటికే నటిగా నిరూపించుకున్నా.. నిహారికకు విజయం మాత్రం దక్కలేదు. 'సూర్యకాంతం'తోనైనా హిట్ కొట్టాలని భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచానాల్ని పెంచాయి. రాహుల్ విజయ్ హీరోగా నటించగా, పెర్లెన్ భేసానియా మరో హీరోయిన్గా నటించింది. 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్నకూచి' వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వం వహించాడు.
విభిన్న కథాంశంతో 'సూపర్ డీలక్స్'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తమిళ నటుడు విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ... ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూపర్ డీలక్స్'. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం... ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది.
విజయ్ సేతుపతి లేడీ గెటప్‌లో నటిస్తుండటం, సమంత హీరోయిన్ కావడం, రమ్యకృష్ణ వేశ్య పాత్ర పోషించడం ఇవన్నీ ఇందులో విశేషాలు.
త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు.
కొత్తవారితో తీశారీ 'నోట్‌బుక్'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వెండితెరకు కొత్త వారిని పరిచయం చేయడంలో హీరో సల్మాన్ ఖాన్ ముందుంటాడు. ఈరోజు విడుదలవుతున్న నోట్‌బుక్ సినిమాతో.. జహీర్ ఇక్బాల్, ప్రనూతన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. 2014లో వచ్చిన 'టీచర్స్ డైరీ' చిత్రానికి రీమేక్‌గా వస్తోందీ మూవీ.
అడవుల్లో విద్యుత్ జమ్వాల్ సాహాసం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన సినిమా 'జంగ్లీ'. అమెరికన్ దర్శకుడు చెక్ రసెల్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పూజా సావంత్, ఆశా భట్ నటించారు.
అడవిలో జంతువులు, ఒక మనిషికి మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుంది.. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కోసం కలరిపట్టు విద్యను నేర్చుకున్నాడు హీరో. మార్చి 6న విడుదలైన ట్రైలర్‌ని ఇప్పటి వరకు 22 మిలియన్ల మంది వీక్షించారు.
ఇవీ చదవండి: