కాంగ్రెస్ ఆధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో కేసు నమోదైంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌ను గౌరవంగా సంబోధించినందుకు ఆయనపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు.
"పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది జవాన్ల మృతికి 'మసూద్ అజార్ జీ' బాధ్యత వహించాలి"
-దిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలు
" పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడైన రాహుల్ గాంధీ మసూద్‌పై చేసిన వ్యాఖ్యలను దేశమంతా విన్నది. ఉగ్రవాదుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం అంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాహుల్ వ్యాఖ్యలపై సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశా. మార్చి 23న కోర్టు ఈ కేసును విచారించనుంది."
-దివాకర్ వర్మ, న్యాయవాది