ETV Bharat / briefs

కార్లు అద్దెకు తీసుకుని కాజేస్తున్న కేడీల అరెస్టు - rachakonda police

'మోసాల యందు మా మోసాలు వేరయా' అంటూ నేరగాళ్లు రోజుకో రకమైన అక్రమాలకు తెరలేపుతున్నారు. కార్లు అద్దెకు తీసుకుంటామంటూ యజమానులను బురిడీ కొట్టిస్తున్నారు. ఒకటీ, రెండు కాదు... ఏకంగా 23 కార్లు తీసుకుని వేరేచోట కుదవ పెట్టేశారు. రాచకొండ పోలీసుల చాకచక్యంతో పట్టుబడి కటకటాలపాలయ్యారు.

car-cheating
author img

By

Published : Apr 24, 2019, 5:25 PM IST

అద్దె పేరుతో కార్లు తీసుకొని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని బాలాపూర్​ మండలం బండంగ్​ పేటకు చెందిన శ్రీకాంత్​ వృత్తిరీత్యా డ్రైవరు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో డ్రైవరు​గా పనిచేసిన శ్రీకాంతా చారి అనే వ్యక్తి ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నట్లు చెబుతూ... ప్రభుత్వ కార్యాలయాల్లో కార్లు అద్దెకి పెట్టిస్తానని కొంతమందిని నమ్మించాడు. నెలకు రూ. 30వేలు చెల్లిస్తానంటూ నమ్మబలికి ఒక నెల చెల్లించి తర్వాత ముఖం చాటేసేవాడు. ఈ కార్లను మహేంద్రసింగ్ అనే వ్యక్తి సహకారంతో ఇతర చోట్ల తనఖా పెట్టేవాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 70వేల నగదు, 23 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

కార్లు అద్దెకు తీసుకుని కాజేస్తున్న కేడీల అరెస్టు

ఇదీ చదవండి: అక్రమంగా నిల్వ ఉంచిన 600 కిలోల బెల్లం స్వాధీనం

Intro:HYD_TG_37_24_SHAMIRPET_NOMINATIONS_AB_C9

Body:మేడ్చల్: స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడత లో భాగంగా షామిర్పెట్, మూడు చింతలపల్లి, మేడ్చల్ లో బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ లు దాఖలు చేశారు. నూతనంగా ఏర్పడిన మూడు చింతలపల్లి జడ్పీటీసీ జనరల్ రిజర్వ్ కావడంతో పోటీ ఎక్కువగా ఉంది.

Conclusion:బైట్: హరివర్ధన్ రెడ్డి, మూడు చింతలపల్లి, కాంగ్రెసు అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.