భవనాలను అప్పగించే వ్యవహారం కొనసాగుతోంది. గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినందున... ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ ఈ నెల 19 లోగా అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి ఇప్పటికే లేఖ రాశారు. సోమవారం పలు భవనాలను తెలంగాణ అధికారులకు అప్పగించారు. మంత్రుల నివాస ప్రాంగణం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలను అప్పగించారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులను తెలంగాణకు అప్పగించారు. మిగతా వాటిని ఇవాళ అప్పగించనున్నారు. భవనాల అప్పగింత కొలిక్కి వచ్చినందున నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలో నూతన సముదాయాన్ని నిర్మించనున్నారు. అందుకోసం సెక్రటేరియట్లో ఉన్న కార్యాలయాలను తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొత్త సచివాలయం నిర్మాణంపై కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి భవనాల తరలింపు అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రుల కార్యాలయాలను, శాఖాధిపతుల కార్యాలయాలకు మిగతా వాటిని బూర్గుల రామకృష్ణారావు భవన్కు తరలించనున్నట్లు కనిపిస్తోంది. గతంలో హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను మరోమారు పరిశీలించి కొత్త సచివాలయ సముదాయ నిర్మాణ నమూనాలను ఖరారు చేయనున్నారు.
ఇదీ చూడండి: ఏపీ భవనాల అప్పగింత వేగవంతం