ETV Bharat / briefs

జీవన్​రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు: భట్టి - congress

జీవన్​రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు. ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక, అరాచక పాలనకు వ్యతిరేకంగా... కేవలం మూడు నెలల్లోనే ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రేపు జరిగే లోక్​సభ ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుంది. ---- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
author img

By

Published : Mar 29, 2019, 2:22 PM IST

Updated : Mar 29, 2019, 3:05 PM IST

పదహారు స్థానాలతో దిల్లీకి వెళితే కేసీఆర్​ను పలకరించేవారే ఉండరని దుయ్యబట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి భాజపాకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. మోదీని మళ్లీ ప్రధాన మంత్రిని చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని విమర్శించారు.

ఎంఐఎం నేతల వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాకు మద్దతు ఇస్తున్న తెరాసతో ఎంఐఎం కలసి ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జహీరాబాద్, వనపర్తి, హుజూర్​నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇవీ చూడండి:గాంధీభవన్​లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ

Last Updated : Mar 29, 2019, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.