ETV Bharat / briefs

సిరిసిల్ల మగ్గాలకు బతుకమ్మ కళ - siricilla

మగువుల మనసు దోచే చీరలతో... బతుకమ్మ పండుగని మరింత ఆనందంగా జరుపుకునేలా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అతివల అభిరుచికి తగ్గట్టుగా చీరలు తయారీ చేయించేందుకు నేతన్నలకు పలు సూచనలు చేసింది.

bathukamma-sarees
author img

By

Published : May 29, 2019, 11:36 AM IST

ఆకర్షణీయమైన రంగులు.. అందమైన డిజైన్లు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం మరో ముందడుగు వేస్తోంది. మొదటి సారి ఇచ్చిన చీరలు బాగాలేవని విమర్శలు వచ్చాయి. ఈ ఏడు అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళల అభిరుచికి తగ్గట్టుగా చీరలు తయారీ చేయించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఆకర్షణీయమైన రంగులు, అందమైన డిజైన్లు

గతేడాదికి భిన్నంగా ఆకర్షణీయమైన రంగులు... అందమైన జరీ అంచుల డిజైన్లను నిర్ణయించారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో నూలు వినియోగంపై సిరిసిల్లలోని పరిశ్రమ వర్గాలకు టెస్కో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చీరల్లో నాణ్యత, నవ్యత గతేడాది కన్నా మరింత ఆకర్షణీయంగా ఉండాలని పలు కంపెనీల నూలును పరిశీలించారు. కాటన్, పాలిస్టర్ కలయికతో బ్లెండ్ శాతాలను సరి చూశారు. చీరల ఉత్పత్తిలో ఐదు కంపెనీల నూలు మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 15 లోపు మొత్తం 710 టన్నుల నూలును అందజేసేందుకు ఆయా కంపెనీలు అంగీకరించాయి.

ఆగస్టు నెలాఖరులో పూర్తి

ప్రభుత్వం ఆడపడుచులకు అందజేసే చీరల ఉత్పత్తికి లక్ష్యం ఖరారైంది. ఈ సారి టెక్స్​టైల్స్ పార్కులోని మరమగ్గాలను ఉత్పత్తిలో భాగస్వామ్యం చేశారు. ఆగస్టు చివరి నాటికి లక్ష్యం పూర్తి చేయాలని నిర్దేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమలో 35 వేల మరమగ్గాలున్నాయి. వీటిలో బతుకమ్మ చీరలను 23 వేల 500 మరమగ్గాలపై ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. బతుకమ్మ చీరలతో సిరిసిల్ల మూడు నెలల పాటు సుమారు 20 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు.

సంఘాలకు ఆర్డర్లు

ఏటా బతుకమ్మ చీరల తయారీకి సర్కారు 280 కోట్లను కేటాయిస్తోంది. టెస్కో సేకరణ ధరను మీటరుకు 32 రూపాయలుగా నిర్ణయించింది. వీటిలో నూలు కొనుగోలు పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు పోను కార్మికులు, ఆసాములకు కలిపి మీటరుకు రూ.8.50 చెల్లించాలని చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. ఒక్కో కార్మికుడికి నెలకు సగటున 18 వేల వేతనం పొందనున్నారు. వారం రోజుల నుంచి చేనేత, జౌళి సంఘాలకు, యూనిట్లకు ఆర్డర్లు అందుతున్నాయి. నాలుగు రోజుల క్రితం అధికారికంగా చీరల ఉత్పత్తిని ప్రారంభించారు.

ఇదీ చూడండి: 'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.