ETV Bharat / briefs

'ఏపీ భవనాలు ఇక నుంచి తెలంగాణకే' - jagan

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్​లో ఏపీకి  కేటాయించిన ప్రభుత్వ భవనాలను గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకారంతో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే స్ఫూర్తితో మిగతా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఆలోచనతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి.

'ఏపీ భవనాలు ఇక నుంచి తెలంగాణకే'
author img

By

Published : Jun 3, 2019, 6:20 AM IST

Updated : Jun 3, 2019, 7:54 AM IST

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు తొలి అడుగు పడింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్​లో ఆంధ్రప్రదేశ్​కు కేటాయించిన ప్రభుత్వ భవనాలు తెలంగాణకు దక్కాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్​ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్​లోని సచివాలయం, శాసనసభ సహా పలు భవనాలను ఏపీ కార్యకలాపాల కోసం విభజన సమయంలో గవర్నర్ కేటాయించారు.

ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభించి పూర్తి స్థాయి కార్యకలాపాలు అక్కడినుంచే చేస్తుండడం వల్ల ఈ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది. శనివారం రాజ్​భవన్​లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్​లోని భవనాలను అప్పగించేందుకు ఏపీ సీఎం జగన్​ అంగీకరించారు.

ఏపీ ముఖ్యమంత్రి సుముఖత

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం రాజ్​భవన్​కు వెళ్లి కేబినెట్ తీర్మాన ప్రతిని అందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుముఖత, తెలంగాణ విజ్ఞప్తి నేపథ్యంలో భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పోలీస్ విభాగం కోసం ఒకటి, ఇతర శాఖల కోసం మరొక భవనాన్ని హైదరాబాద్​లో కేటాయించనున్నారు. లక్డీకాపుల్​లో సీఐడీ కోసం నిర్మించిన భవనంలో ఏపీ డీజీపీ కార్యాలయం కొనసాగుతోంది. ఆ భవనాన్ని అలాగే కొనసాగించే అవకాశం ఉంది. మిగతా శాఖల కోసం సచివాలయంలో లేదా వెలుపల మరో భవనాన్ని కేటాయించనున్నారు. గవర్నర్ నిర్ణయంతో సచివాలయం, అసెంబ్లీ, వివిధ శాఖాధిపతుల పరిధిలోని కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన భవనాలు, వసతి గృహాలు, నివాస సముదాయాలు తదితర భవనాలన్ని పూర్తిగా తెలంగాణకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 159 భవనాలు ఉంటాయని అంచనా.

మిగిలిన శాఖలు ఎప్పుడు

మిగతా సమస్యల్లో ప్రధానంగా విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలో సంస్థలు, ఉద్యోగుల విభజనాంశాలు ఉన్నాయి. అటు విద్యుత్ ఉద్యోగుల విభజన, హోంశాఖలో డీఎస్పీల పదోన్నతులు, నాలుగో తరగతి ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారం జరగాల్సి ఉంది.

'ఏపీ భవనాలు ఇక నుంచి తెలంగాణకే'
ఇదీ చదవండి: నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు

This is test file from feedroom
Last Updated : Jun 3, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.