నూతన శాసనసభ, మండలి భవనాల నిర్మాణాల కోసం ఎర్రమంజిల్లో భూమి పూజ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు అసెంబ్లీ, మండలి భవనాలకు భూమి పూజ చేయనున్నారు. ఈరోజు భూమి పూజ చేసే స్థలాన్ని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ అధికారులు పరిశీలించారు. పూజ కోసం ఇక్కడి ప్రదేశాన్ని జీహెచ్ఎంసీ అధికారులు శుభ్రం చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశం నిర్వహించి... అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అసెంబ్లీ, మండలి నిర్మాణాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. మొత్తం 17 ఎకరాలలో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఇవీ చూడండి: ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడిచేసిన మహిళా రైతు