మోదీ చెప్పిన అచ్చేదిన్ ఏమైయ్యాయని ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ మండిపడ్డారు. 5 కోట్ల యువతకు ఉద్యోగాలు అన్నారు, వచ్చాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నాంపల్లిలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఓవైసీ పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే... దానిని మోదీ తిరస్కరించారని ధ్వజమెత్తారు. మేం ఎవరికీ బి టీమ్, సి టీమ్ కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ వ్యాపారులు, బ్యాంకు ఎగవేతదారులకు మాత్రమే మోదీ కాపలాదారుగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో తెరాస, ఎంఐఎం కలిసి 17 ఎంపీ స్థానాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ 20 నుంచి 21 ఎంపీలు, 130 మంది ఎమ్మెల్యేలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధం:రైతులు