చెన్నై సుపర్ కింగ్స్‌తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 పరుగుల తేడాతో ఓడింది. బెన్ స్టోక్స్ మెరుపులు రాయల్స్‌కు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నై బౌలర్లు రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా స్టోక్స్‌ను బ్రావో పెవిలియన్‌కు పంపాడు. దీంతో రాయల్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. చెన్నైకు ఇది వరుసగా ముడో గెలుపు కావడం విశేషం.
కుప్పకూలిన టాప్ ఆర్డర్..
176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్‌కు శుభారంభం దొరకలేదు. ఓపెనర్లు సహా గత మ్యాచ్ సెంచరీ హీరో సామ్సన్ తొందరగా ఔట్ అయ్యాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాయల్స్ జట్టు.
ఆదుకున్న మిడిలార్డర్...
త్రిపాఠి (39), స్టీవ్ స్మిత్ (28) కలసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సరైన సమయంలో చెన్నై బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
స్ట్రోక్ ప్లేతో అదరగొట్టిన స్టోక్స్...
స్టోక్స్ బ్యాటింగ్ వచ్చేసరికి కొట్టాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. స్టోక్స్ సమయోచిత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అవసరమైన సమయాల్లో బౌండరీలు బాదుతూ గెలుపు దిశగా తీసుకెళ్లాడు. 26 బంతుల్లో 46 పరుగులు చేశాడు. స్టోక్స్‌కు జత కలసిన ఆర్చర్ (24) మెరుపులతో ఆఖరి ఓవరుకు రాయల్స్ విజయానికి12 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది.
బ్రావో మ్యాజిక్...
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బ్రావో మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఊపు మీద ఉన్న స్టోక్స్‌ను తొలి బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఈ ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో చెన్నై 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
ధోని మెరుపులు...అభిమానుల అరుపులు
అంతకుముందు చెన్నై బ్యాటింగ్‌లో ధోని దుమ్మురేపాడు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన చెన్నైని ధోనీ, రైనా ఆదుకున్నారు. రైనా 36 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివరి వరుకు నిలిచిన ధోని ఆఖర్లో విశ్వరూపం చూపించాడు. ఆఖరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మొత్తానికి 46 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ధోని నిలిచాడు.
ఇదీ చూడండి:ఒక్కడై నిలిచిన ధోని..రాజస్థాన్ లక్ష్యం 176 పరుగులు