ETV Bharat / briefs

ఆంధ్రాలో ఏ ఫలితం ముందు, ఏది చివరన... - నందిగామ

ఈనెల 23న జరుగనున్న ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఏ నియోజకవర్గం నుంచి తొలి ఫలితం వస్తుందన్నది అందరికీ ఆసక్తే. అలాగే చిట్టచివరి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటమూ ముఖ్యమే. ఏపీలో అతితక్కువ రౌండ్లతో తొలిగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం ఫలితం వెల్లడి కానుంది. చిట్టచివరిగా నందిగామ ఫలితం రానుంది.

evm
author img

By

Published : May 22, 2019, 1:18 PM IST

'నర్సాపురం'తో మొదలై... 'నందిగామ'తో ముగింపు

ఎన్నికల ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ ఈనెల 23న నర్సాపురం నియోజకవర్గం నుంచి తొలిఫలితం వెల్లడి కానుంది. ఈ నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే జరగనున్నందున ఫలితాలు మొదటిగా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యధికంగా కృష్ణా జిల్లా నందిగామలో 32 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ హాల్ చిన్నది కావడం వలన టేబుళ్ల సంఖ్యను బాగా కుదించారు. దీంతో ఎక్కువ రౌండ్లలో కౌంటింగ్ జరుగనుంది. ఇక్కడ 7 టేబుళ్లలో మాత్రమే లెక్కించాలని రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ అనుమతి తీసుకున్నారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టనుంది.

తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. చివరిగా వీవీప్యాట్లు

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సర్వీసు ఓట్లు, తదనంతరం ఈవీఎంలు, చిట్ట చివరిగా వీవీప్యాట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. పోస్టల్, సర్వసు ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా.. 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 36 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వారీగా కొన్ని చోట్ల 14 టేబుళ్లు, 12, 10, 7 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు లెక్కింపు రోజు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఏజెంట్లు, అధికారుల సంతకాలతో ఈవీఎంలకు మూడు సీళ్లను వేస్తామనీ.. వీటిని ఏమార్చటం వీలుకాదని స్పష్టం చేస్తోంది.

విధుల్లో 25వేల మంది సిబ్బంది

లెక్కింపు ప్రారంభమయ్యే రోజు ఉదయం 5.30 గంటల వరకూ ఏ నియోజకవర్గం కేటాయించామో సిబ్బందికి తెలీదని ఈసీ స్పష్టం చేసింది. 25 వేల మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నట్లు వివరించింది. ఫలితాలను వేగంగా ఇవ్వటం కంటే.. కచ్చితత్వంతో ఇవ్వటానికే ప్రాధాన్యమివ్వనున్నట్టు ఈసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫలితాలు తొలుత ఈసీఐకి చెందిన సువిధా పోర్టల్​లో నమోదయ్యాకే బయటకు వెల్లడిస్తామని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని... అనంతరం లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసిన వీవీప్యాట్లను లెక్కిస్తామని అధికారులు తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపునకు మరో 5 గంటలు పడుతుందని వివరించారు.

ఇవీ చదవండి. 'ఈవీఎం' రాజకీయంలో ఇంకెన్ని మలుపులో..?

Intro:ap_knl_82_21_pidugupadi_ vyakthi_mruthi_av_c8
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పడిన పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు

Body:చింతకుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు 50 అనే వ్యక్తి ఇ గ్రామాన్ని దగ్గరలోనే మసీదు దగ్గర అ గొర్రెలు మేపుతుండగా భారీ ఈదురు గాలులతో కూడిన పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు

Conclusion:ఈయనకు ఇంద్ర కుమారులు కూతురు భార్య ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.