ETV Bharat / briefs

స్పందించకుంటే రాష్ట్రపతిని కలుస్తాం

ఇంటర్​ ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద దీక్ష చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు, కాంగ్రెస్​ నేతల మధ్య గొడవలతో దీక్ష ముగిసింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని నేతలు హెచ్చరించారు.

author img

By

Published : May 11, 2019, 11:58 PM IST

స్పందించకుంటే రాష్ట్రపతిని కలుస్తాం
స్పందించకుంటే రాష్ట్రపతిని కలుస్తాం

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం ప్రారంభమైన నిరసనకు కుంతియా, ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్​ రెడ్డి, కోదండరామ్​, చాడ వెంకట్​ రెడ్డి, వీహెచ్​, పొన్నం ప్రభాకర్​, మందకృష్ణ మాదిగ, చెరుకు సుధాకర్​, పీఓడబ్ల్యూ సంధ్య హాజరయ్యారు. చనిపోయిన విద్యార్థులకు నివాళులు అర్పించారు.

సీఎం కేసీఆర్‌ బాధ్యాతారాహిత్యం వల్లే 26 మంది విద్యార్థులు చనిపోయారని.. వీటిని తప్పించుకోవడం కోసం దేవాలయాల చుట్టు తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విద్యార్ధుల చావులకు కారణమైన గ్లోబరీనా సంస్థపై కేసులు పెట్టి ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. తెరాస పాలనలో భూ, డ్రగ్‌, విద్యా మాఫియా చెలరేగిపోతుందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని రమణ డిమాండ్‌ చేశారు.

బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చనిపోవడం దేశానికి చాలానష్టమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ ఆర్​.సి.కుంతియా అన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి విహారయాత్రలు చేస్తున్నారని తెజస అధ్యక్షడు కోదండరామ్​ విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుంటే దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని కోదండరామ్​ పేర్కొన్నారు. ఈ నిరసన దీక్షలో చనిపోయిన విద్యార్థుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

దీక్షలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. వీహెచ్​ స్టేజిపైకి కుంతియాను ఆహ్వనించగా... కాంగ్రెస్​ అధికార ప్రతినిధి నాగేశ్​ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నాగేశ్​, వీహెచ్​కు మధ్య గొడవ జరిగి.. ఇద్దరు నేతలు కిందపడిపోయారు. అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు గొడవ సద్దుమణిగించారు. అనంతరం రెండు గంటల వరకు దీక్ష ప్రశాంతంగా కొనసాగింది.

ఇవీ చూడండి: అవసరమైన చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.