లఖ్‌నవూ విమానాశ్రయ ఘటనలో పలు రాజకీయ నేతలు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌కు మద్దతుగా నిలిచారు. విమానాశ్రయ పోలీసులు అఖిలేశ్‌ను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
అఖిలేశ్ యాదవ్ అలహాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళుతుండగా ఎయిర్‌పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి విమానం వెళ్లిపోయిన తరువాత అఖిలేశ్‌ను బయటకు పంపించారు.
ప్రయాగ్‌రాజ్ వెళ్లకుండా యూపీ పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకోవడంపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి సర్కార్ 'కుట్ర' చేస్తోందంటూ మండిపడ్డారు. ఎలాంటి ఆదేశాలు లేకుండానే తనను అడ్డుకున్నారని ట్వీట్ చేశారు.
I was prevented from boarding the airplane without any written orders. Currently detained at Lucknow airport.
— Akhilesh Yadav (@yadavakhilesh) February 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It is clear how frightened the govt is by the oath ceremony of a student leader. The BJP knows that youth of our great country will not tolerate this injustice anymore! pic.twitter.com/xtnpNWtQRd
">I was prevented from boarding the airplane without any written orders. Currently detained at Lucknow airport.
— Akhilesh Yadav (@yadavakhilesh) February 12, 2019
It is clear how frightened the govt is by the oath ceremony of a student leader. The BJP knows that youth of our great country will not tolerate this injustice anymore! pic.twitter.com/xtnpNWtQRdI was prevented from boarding the airplane without any written orders. Currently detained at Lucknow airport.
— Akhilesh Yadav (@yadavakhilesh) February 12, 2019
It is clear how frightened the govt is by the oath ceremony of a student leader. The BJP knows that youth of our great country will not tolerate this injustice anymore! pic.twitter.com/xtnpNWtQRd
" ఏ రాతపూర్వక ఆదేశాలు లేకున్నా లఖ్‌నవూ విమానాశ్రయ అధికారులు నన్ను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకుడి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో ఇప్పుడు స్పష్టమవుతోంది. మన దేశ యువత ఇలాంటి అన్యాయాన్ని సహించరని భాజపాకు తెలుసు. "
- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లఖ్‌నవూ పోలీసుల తీరును తప్పుబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు.
I've already spoken to @yadavakhilesh. We all condemn the arrogant attitude of the so-called #BJP ‘leaders’ who didn't allow Akhilesh to address the students. Even @jigneshmevani80 was not allowed. Where is the democracy in our country? And they are giving lessons to everybody!
— Mamata Banerjee (@MamataOfficial) February 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I've already spoken to @yadavakhilesh. We all condemn the arrogant attitude of the so-called #BJP ‘leaders’ who didn't allow Akhilesh to address the students. Even @jigneshmevani80 was not allowed. Where is the democracy in our country? And they are giving lessons to everybody!
— Mamata Banerjee (@MamataOfficial) February 12, 2019I've already spoken to @yadavakhilesh. We all condemn the arrogant attitude of the so-called #BJP ‘leaders’ who didn't allow Akhilesh to address the students. Even @jigneshmevani80 was not allowed. Where is the democracy in our country? And they are giving lessons to everybody!
— Mamata Banerjee (@MamataOfficial) February 12, 2019
"ఇప్పటికే నేను అఖిలేశ్‌యాదవ్‌తో మాట్లాడాను. అఖిలేశ్‌ను విద్యార్థుల సమావేశానికి హాజరవకుండా అడ్డుకున్న భాజపా నేతల అహంకార పరిపాలనను మేమందరం ఖండిస్తున్నాం. జిగ్నేశ్ మేవానీనీ అనుమతించలేదు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? "
- మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి
"ఇది చాలా దురదృష్టకరమైన చర్య, పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎస్పీ-బీఎస్పీ కూటమిని చూసి భాజపా భయపడుతోంది. "
-మాయావతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నా...
ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు దిగారు. చివరకు గవర్నర్ హామీతో ధర్నాను విరమించారు.