ETV Bharat / briefs

మే 20లోగా రైతుల సమగ్ర సర్వే పూర్తి

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లభించింది. నెల రోజుల పాటు రైతు సమగ్ర సర్వే చేపట్టనున్నందున ఆ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించవద్దని సీఎం కేసీఆర్​  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషికి సూచనలిచ్చారు.

author img

By

Published : Apr 18, 2019, 10:26 AM IST

agriculture-officers

ఎన్నికల విధులతో రైతుల కార్యక్రమాలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆ శాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగించవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపాలని నిర్ణయించారు. రైతు సర్వే పది రోజుల్లో పూర్తి చేయాలని కేసీఆర్​ ఆదేశించగా.. అది సాధ్యం కాదని, కనీసం నెల రోజులు పడుతుందన్న ఆ శాఖ విన్నపాన్ని ఆమోదించారు. మే 20లోగా సమగ్ర సర్వే పూర్తి చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటి వరకూ 54.60 లక్షల మందికి మాత్రమే కొత్త పట్టాదారు పాస్​పుస్తకాలు పంపిణీ చేశామని రెవెన్యూశాఖ తెలిపింది. ఈ సమాచారామంతా అంతర్జాలంలో ఉంది. దీనిని గ్రామాల్లో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారికి పంపనుంది. ఈ సమాచారంతో అందరి ఇళ్లకు వెళ్లి సమగ్రంగా పూర్తి సమాచారం సేకరించాలి. ఈ వివరాలన్నీ మే నెలాఖరులోగా ఆన్​లైన్లో పొందుపర్చాలి. వీటిని ప్రామాణికంగా తీసుకొని ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగుచెయ్యాలనేది నిర్ణయించి పంట కాలనీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది వ్యవశాయ శాఖ ప్రణాళిక.

పూర్తి సమాచార సేకరణే లక్ష్యం

సాధారణ పంటలే కాకుండా ఉద్యాన , సుగంధ ద్రవ్యాలు వంటి పంటల సాగు వివరాలన్నీ సేకరించాలని ఉద్యానశాఖ ఏఈవోలకు సూచనలిచ్చింది. ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు సాగవుతున్నాయనే సమాచారం లేదు. ఈ సర్వేతో పంటల దిగుబడిపై పక్కా అంచనాలు వస్తాయని భావిస్తున్నారు.

అందరి వివరాలు సేకరించం

తాము చేసే సమగ్ర సర్వేలో కొత్త పట్టాదారు పాస్​పుస్తకం అందిన లేదా డిజిటల్​ సంతకమైన రైతు జాబితాలనే తీసుకుంటామని వ్యవశాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.

మే 20లోగా రైతుల సమగ్ర సర్వే పూర్తి
ఇదీ చదవండి: దిగుమతి కాదు.. ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.