రంగారెడ్డి జిల్లా పత్తిపూర్ గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ పంపులో దారుణం జరిగింది. డీజిల్ పోయడానికి ఓ ట్యాంకర్ బంక్‌కు వచ్చింది. డీజిల్ పోసిన తర్వాత డ్రైవర్ బండిని ముందుకు నడిపించాడు. అయితే ట్యాంకర్ ముందు ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడు. అది చూడకుండా డ్రైవర్.. ట్యాంకర్‌ను అతని పైనుంచి పోనిచ్చాడు. అక్కడ ఉన్న కొంతమంది పడుకున్న వ్యక్తిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
తీవ్రగాయాలైన వాటర్ మాన్ పెంటయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా మరణించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డ్రైవర్ సిద్ధార్థ్ కన్స్ట్రక్షన్కు చెందినవాడిగా స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని ఆరోపించారు. ఇంతా జరిగిన అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'బర్త్ డే బంప్స్ పేరిట వెర్రి వేషాలు'