ETV Bharat / briefs

ఆన్​లైన్​లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు - తిరుపతి

తితిదే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. 2019 సెప్టెంబరు నెలకు సంబంధించి ఆన్​లైన్​లో టికెట్లు అందుబాటులో ఉంచింది.

ఆన్​లైన్​లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
author img

By

Published : Jun 7, 2019, 12:41 PM IST

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్​లైన్​లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్ నెలకు సంబంధించి 70వేల 918 టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10, 618.. కరెంట్ బుకింగ్ కింద 60వేల 300 ఆర్జిత సేవా టికెట్లు ఆన్​లైన్​లో పెట్టింది.

టికెట్ల వివరాలు
సుప్రభాతం- 7,898
తోమాల- 120
అర్చన- 120 టికెట్లు
అష్టాదళ పాదపద్మారాధన- 180
నిజపాద దర్శనం- 2,300
విశేషపూజ -2,000
కల్యాణోత్సవం- 13,775
ఊంజల్‌సేవ- 4,350
ఆర్జిత బ్రహ్మోత్సవం -7,975
వసంతోత్సవం- 15,400
సహస్ర దీపాలంకరణ- 16,800

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్​లైన్​లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్ నెలకు సంబంధించి 70వేల 918 టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10, 618.. కరెంట్ బుకింగ్ కింద 60వేల 300 ఆర్జిత సేవా టికెట్లు ఆన్​లైన్​లో పెట్టింది.

టికెట్ల వివరాలు
సుప్రభాతం- 7,898
తోమాల- 120
అర్చన- 120 టికెట్లు
అష్టాదళ పాదపద్మారాధన- 180
నిజపాద దర్శనం- 2,300
విశేషపూజ -2,000
కల్యాణోత్సవం- 13,775
ఊంజల్‌సేవ- 4,350
ఆర్జిత బ్రహ్మోత్సవం -7,975
వసంతోత్సవం- 15,400
సహస్ర దీపాలంకరణ- 16,800

ఇవీ చదవండి.. ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయి పోరాటమే...

Intro:jk_ap_gnt_46_07_taati_bellam_tayari_pkg_c9...

యాంకర్:

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్య రీత్యా ఎంతో దెబ్బ తింటున్నాడు. ఆరోగ్యం కోసం ఎంత డబ్బయినా వెచ్చించేందుకు... ఎంత కష్టమైనా భరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యం బారిన పడాలన్న అంతా తినే తిండి లోనే ఉంది . శరీరానికి హాని చేసే తింటే రోగాలు... మేలు చేసేది తింటే ఆరోగ్యం కలగడం సహజమే. అలా మేలుచేసే ఆహార పదార్థాలలో తాటి బెల్లం ఒకటి. ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన తాటి బెల్లం తయారీ విధానాన్ని, ఉపయోగాలలో తెలుసుకుందాం.

వాయిస్: ఇది గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కళ్లిపాల గ్రామం. ఈ మారు మూల తీర ప్రాంతం జిల్లాలో తాటి బెల్లం తయారుచేసే ఏకైక గ్రామంగా ప్రసిద్ధి.ఇక్కడ అందరూ గీత కార్మికులే ఉండడంతో తమ పూర్వీకుల నుంచి అదే వృత్తిని నమ్ముకున్నారు. అయితే ఈ గ్రామంలోని గీత కార్మికులు తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును అమ్మేందుకు కాకుండా దాని నుంచి తాటి బెల్లాన్ని తయారు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎంతో ప్రకృతి సిద్ధంగా తయారు చేసి... అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.

వాయిస్: మొదట సముద్రపు నుంచి వచ్చే పిల్ల కాలువల్లో ఉండే నత్తగుల్ల సేకరించి వాటిని శుభ్రంగా నీటితో కడిగి ఆర బెడతారు. తర్వాత కాల్చి తెలుపు రంగులోకి రాగానే సున్నంలా పొడి చేస్తారు. అలా పొడి చేసిన తెల్లటి సున్నంను కల్లుకుండ లోపల భాగంలో పూసి తాడిచెట్లకు తగిలిస్తారు. ఈ పొడి వలన కుండ లోపల పడే కల్లు చేదుగా ,వగరుగా, తీపిదనం తో ఉన్న మిశ్రమంలా మారుతుంది. దీన్ని పానకం గా పిలుస్తారు.

వాయిస్: అలా చెట్టుపైన కల్లు పాకంను తీసుకొచ్చి మంటపైన ఉంచిన కడాయిలో పోసి మరిగిస్తారు. ఇలా రోజంతా 100 లీటర్ల పానకాన్ని మరిగిస్తే పది లీటర్ల బెల్లం చారు వస్తుంది. అలా వచ్చిన చారు ను పెద్ద పెద్ద డ్రమ్ములో గాని కుండల్లో గాని నిల్వ ఉంచుతారు. నీరు తగలకుండా జాగ్రత్త ఉంచితే చారు సుమారు రెండు సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటుంది. ఈ బెల్లం చారును తాటిబెల్లంగా మార్చేందుకు మరోసారి మరిగించాలి. అప్పుడు బాగా చిక్కగా మారిన పాకాన్ని చల్లబరిచి నేలమీద ముందుగా చేసిన ఉంచిన అచ్చుల్లో పోయాలి.ఇలా చేసిన 15 నిమిషాల్లో పాకం గడ్డకట్టి బెల్లం మారుతుంది.

వాయిస్: అయితే చెరుకుతో తయారుచేసిన బెల్లంతో పోల్చుకుంటే తాటి బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ధర కూడా మామూలు బెల్లంకి రెట్టింపు ఉంటుంది. ఈ బెల్లం మలబద్ధకం తగ్గించేందుకు, శరీరంలోని వేడి తగ్గడానికి, పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచేందుకు, శ్వాసనాళ సమస్య లు దగ్గు, జలుబు వంటి ఎన్నో రోగాలను తగ్గించడంతో పాటు గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరమని తయారీదారులు చెప్తున్నారు. గుంటూరు విజయవాడ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల నుంచి కూడా ఈ మారు మూల గ్రామానికి వచ్చి తాటి బెల్లం కొనుగోలు చేసుకుంటున్నారని వాపోతున్నారు.

వాయిస్: అయితే బయట మార్కెట్లో తాటి బెల్లంకి మంచి డిమాండ్ ఉన్న కష్టాన్ని నమ్ముకుని రాత్రింబవళ్లు చెలల్లోనే కష్టపడుతున్న సరైన ధర దొరకడం లేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారూ. దీంతో క్రమంగా బెల్లం తయారీ దారులు తగ్గిపోతూ వస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.


Body:బైట్స్...గీత కార్మికులు(1టూ4)
5.కొనుగోలు దారుడు


Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
ఎస్.కె మీరా సాహెబ్ 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.