రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, పశ్చిమ బంగా, ఝార్ఖండ్, బీహార్లో పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో రాగల 24 గంటలలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తర కోస్తా, ఆంధ్రాతోపాటు దానిని ఆనుకొని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందన్నారు. దీనికి అనుబంధంగా ఉత్తర ఇంటీరియర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 7.6 కిమీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని అధికారులు వివరించారు.