గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 25పైగా మేజర్ పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిజోన్ పరిధిలో కనీసం 5 ఉద్యానవనాలు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ఖాళీస్థలాలను ఈరోజు ఉదయం దానకిశోర్ పరిశీలించారు. హరితహారం పేరుతో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. పార్కుల నిర్మాణాలకు సంబంధించి అంచనాలు, ప్రణాళికలు వెంటనే రూపొందించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.