నేపాల్‌లో ఘోర విషాదం జరిగింది. భారత్ నుంచి దక్షిణ నేపాల్‌కు వలస కార్మికులతో వెళ్తున్న ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా.. 22 మంది గాయపడ్డారు.
బస్సులో మొత్తం 30 మంది వలస కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న నేపాల్ పోలీసులు, సాయుధ బలగాలు, ట్రాఫిక్ పోలీసులు, బాంకే సాల్యాని సమాజ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్మికులు నేపాల్‌గంజ్ మీదుగా సాలియన్‌లోని తమ సొంత జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
పశ్చిమ నేపాల్‌కు చెందిన ఎంతో మంది వలస కార్మికులు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.
ఇదీ చూడండి:మోదీ 2.0: రెండో ఏడాదిలో తొలి కేబినెట్ భేటీ