ETV Bharat / state

యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం..

Yadadri temple reopen and devotees come to visit god narasimha

author img

By

Published : Mar 28, 2022, 3:55 PM IST

Updated : Mar 28, 2022, 10:19 PM IST

15:49 March 28

మహాసంప్రోక్షణ పూర్తి కావడంతో దర్శనమిస్తోన్న స్వయంభు నృసింహుడు

Yadadri temple reopen: ప్రధానాలయంలో స్వయంభు లక్ష్మీనారసింహుడి దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఆరేళ్లుగా బాలాలయంలోనే కొలువై... భక్తులకు దర్శనమిచ్చిన లక్షీనృసింహుడు తిరిగి తన నివాసానికి చేరుకున్నాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న గర్భగుడి నుంచి భక్త జనసందోహానికి అభయం ఇస్తున్నాడు. ఆలయ పునర్​నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్లుగా దర్శనానికి నోచుకోని భక్తులు.. ఎప్పుడెప్పుడు స్వయంభు లక్ష్మీసమేత నరసింహున్ని సేవించుకుందామా అని ఎదురుచూస్తున్న భక్తుల కోరిక తీరింది.

7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి కావడంతో స్వయంభు యాదాద్రీశుని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు.. చూపు తిప్పుకోనివ్వని శిల్పకళలు... మదిని దోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో.. దేదీప్యమానంగా వెలిగిపోతోన్న గర్భగుడిలో కొలువుదీరిన స్వామివారిని దర్శించి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కాలినడకన కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. పెద్దఎత్తున రానున్న భక్తులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. కొండపైకి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 28, 2022, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.