ETV Bharat / crime

dead body found in hyderabad: కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

author img

By

Published : Oct 5, 2021, 12:46 PM IST

Updated : Oct 5, 2021, 2:52 PM IST

dead body found in hyderabad, mohan reddy dead body found
కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం, ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో మృతదేహం లభ్యం

12:44 October 05

ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యం

కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన మోహన్‌రెడ్డి మృతదేహం(dead body found in hyderabad) లభ్యమైంది. గణేశ్‌ టవర్స్‌లో నివాసముండే మెహన్‌రెడ్డి... గత నెల 25న  ప్రమాదవశాత్తు నాలలో పడిపోయి గల్లంతయ్యాడు. అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా... 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉందని పోలీసులు వెల్లడించారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మద్యం సేవించి వస్తుండగా..

కుత్బుల్లాపూర్‌ గణేష్ టవర్స్​లో నివాసముండే మోహన్ రెడ్డి... గత నెల 25న వైన్స్ వద్ద మద్యం సేవించాడు. భారీ వర్షం రావడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆయన నాలాలో పడినట్లు గుర్తించారు. అప్పటి నుంచి జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా... నేడు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యమైంది(dead body found in hyderabad). మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పిలిచి మోహన్ రెడ్డిగా నిర్ధారించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

'గత నెల 25న ఇంట్లోనుంచి బయల్దేరి... వైన్స్ వద్ద నాలాలో మా బావ పడిపోయారు. ఇన్నిరోజులు డీఆర్​ఎఫ్ బృందాలు, పోలీసులు బాగానే పనిచేశారు. ఇవాళ మృతదేహం చిక్కింది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.'

-ప్రభాకర్ రెడ్డి, మృతుడి బావ

ఏం జరిగింది?

కుత్బుల్లాపూర్ గణేశ్​ టవర్స్​లో నివాసముండే మోహన్​రెడ్డి ఈ నెల 25న.. రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం రావడంతో స్నేహితులు ఇద్దరు పక్కకు ఆగారు. మోహన్​రెడ్డి మాత్రం సిగరెట్ తాగుతూ నాలా పక్కన నిలబడ్డాడు. చూస్తూండగానే.. ఒక్కసారిగా వెనకకు నాలాలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు మోహన్​రెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల మోహన్​రెడ్డి కొట్టుకుపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... ముమ్మరంగా గాలించగా మృతదేహం ఇవాళ దొరికింది.

11 రోజుల తర్వాత..

మోహన్​రెడ్డి కుటుంబ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. రెస్క్యూ బృందాలను పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. చూస్తుండగానే... మోహన్​రెడ్డి ఒక్కసారిగా నాలాలో పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్(viral in social media)​ అయ్యాయి. గల్లంతైన 11 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.

ఇదీ చదవండి: Live Video: మణికొండ ఘటనలాంటిదే ఇంకోటి.. అదే రోజు జరిగినా అలస్యంగా వెలుగులోకి..

Last Updated : Oct 5, 2021, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.