ETV Bharat / city

KRMB: 'కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదు' - తెలంగాణ ఆంధ్ర నీటి వివాదాలు

telangana letter to krmb
telangana letter to krmb
author img

By

Published : Aug 6, 2021, 2:55 PM IST

Updated : Aug 6, 2021, 4:47 PM IST

14:52 August 06

'కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదు'

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ లేఖ రాశారు. ఈ నెల 9న బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉందని.. ఈ కారణంగానే బోర్డు భేటీకి రావడం సాధ్యపడదని లేఖలో పేర్కొన్నారు.  నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించిన తర్వాతే తదుపరి భేటీ తేదీ ఖరారుచేయాలని ఈఎన్సీ కోరారు.  

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలు కాదని.. గురువారమే.. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జీఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. ఈ నెల తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్​లో కేసుల విచారణ ఉందని... ఆ కారణంగా బోర్డు సమావేశానికి హాజరవడం వీలుపడదని తెలిపారు. 

అసలేం జరిగిందంటే..

ఈనెల 3వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ జరిగింది. హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. ఏపీ నుంచి ఆ రాష్ట్ర ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీశ్​, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ వచ్చారు. అంతకు ముందు రోజు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని కోరారు. ఈ దశలో ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి (KRMB, GRMB Boards Meeting) సమావేశం జరపాలని నాటి భేటీలో నిర్ణయించారు. 

హైదరాబాద్ జలసౌధలో ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి (KRMB, GRMB Boards Meeting) సమావేశం నిర్వహించనున్నామని.. కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు.  అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించాల్సి ఉన్నందున సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు. 

ఇవీచూడండి: GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

KRMB, GRMB Boards Meeting: ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం

Last Updated : Aug 6, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.