ETV Bharat / bharat

కాంగ్రెస్​కు మరో షాక్- పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా - sidhu news

Punjab Congress chief Navjot Singh Sidhu resigns
పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా
author img

By

Published : Sep 28, 2021, 3:16 PM IST

Updated : Sep 28, 2021, 7:16 PM IST

15:05 September 28

పంజాబ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్- పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

పంజాబ్​ రాజకీయాలు (Punjab congress news) సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ (Sidhu news) రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.  

పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీ పడడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని లేఖలో తెలిపిన సిద్ధూ.. పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.  

ఈ ఏడాది జులైలో పంజాబ్​ కాంగ్రెస్​ బాధ్యతలు చేపట్టిన సిద్ధూ.. రెండు నెలల్లోనే పదవికి దూరమయ్యారు.  

సిద్దూ బాటలో మంత్రి..

సిద్ధూ రాజీనామాకు మద్దతుగా రెండు రోజుల క్రితం పంజాబ్​ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రజియా సుల్తానా కూడా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సిద్ధూ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి అని, పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటే నడుస్తానన్నారు.

అమరీందర్​ తప్పుకున్న కొద్దిరోజులకే..

ఇటీవల సిద్ధూతో అభిప్రాయభేదాలు, విభేదాలు నడుమ.. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్​ సింగ్​ (Amarinder singh news) రాజీనామా చేశారు. కొద్దిరోజులకే చరణ్​ సింగ్​ చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత.. సిద్ధూను (Sidhu news) లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసిన అమరీందర్​.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంను కానివ్వనని, ఎన్నికల్లోనూ ఓడిస్తాననని ప్రతినబూనారు. సిద్ధూ.. దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.  

భాజపాలోకి అమరీందర్​!

మరోవైపు.. అమరీందర్​ సింగ్​ భాజపాలోకి చేరబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర మంత్రి అమిత్​ షాను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.  

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పీసీసీ చీఫ్​ పదవి నుంచి సిద్ధూ (Sidhu news) తప్పుకున్నారు.  

సిద్ధూ తప్పుకున్న వెంటనే.. అమరీందర్​ ట్వీట్​ చేయడం గమనార్హం. సిద్దూకు స్థిరత్వం లేదని తాను ముందే చెప్పినట్లు, పంజాబ్​ లాంటి సరిహద్దు రాష్ట్రానికి ఆయన తగరని పేర్కొన్నారు. 

సిద్ధూ రాజీనామాపై ఆమ్​ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. ఒక దళితుడు(చరణ్ సింగ్​ చన్నీ) సీఎం కావడం జీర్ణించుకోలేకే సిద్ధూ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించింది.

ఇవీ చూడండి: Bypoll Election: ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికల షెడ్యూల్​ వచ్చేసింది..

భాజపాలోకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్​?

Last Updated : Sep 28, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.