హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. కార్డియాలజీ విభాగంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి, నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరితో పాటు విధులు నిర్వహిస్తున్న మరికొంత మంది సిబ్బందికి కూడా అధికారులు కొవిడ్ పరిక్షలు నిర్వహించనున్నారు.
వైద్యులతో పాటు క్యాథ్‌లాబ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిసింది. అయితే కరోనా ట్రాక్ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి కూడా కరోనా సోకుంతుండటంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
మంగళవారం ఏకంగా 12 మంది ఉస్మానియా వైద్య కళాశాల పీజీ విద్యార్థులు ఈ మహమ్మారి బారినపడ్డారు. కళాశాల వసతి గృహంలో 296 మంది వరకు వసతి పొందుతున్నారు.