Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో మెట్రో రైలు నిలిచిపోవడంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో కారిడార్‌లో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలో కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మెట్రో స్టేషన్లలో భారీ సంఖ్యలో ప్రయాణికులు నిరీక్షిస్తుండడంతో రద్దీ నెలకొంది. లక్డీకపూల్ స్టేషన్ ముందు 35 నిమిషాలు ఆగిన మెట్రోరైలును మెల్లగా స్టేషన్ చేర్చి.. రైలులో సమస్య వచ్చిందని ప్రయాణికులను అధికారులు దించేశారు.
రెండ్రోజుల క్రితం ముసారాంబాగ్ స్టేషన్‌లో కూడా సాంకేతిక కారణంతో రైలు ఆగింది. 20 నిమిషాల పాటు రైలు ఆగడంతో వందలాది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ రైలు ఆగడం కారణంగా వెనుక వస్తున్న రైళ్లకూ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడూ అదే సమస్య పునరావృతమైంది. గాలి దుమారంతో పట్టాలపై ఏదైనా సమస్య తలెత్తిందా లేక సాంకేతిక సమస్య అనే విషయమై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఏమైనప్పటికీ ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు చేరుకుందామని రైలు కోసం లక్డీకపూల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో స్టేషన్లలో ఎదురు చూస్తున్న వేలాది మంది ప్రైవేటు ఉద్యోగులు, తదితరులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఇవీ చదవండి: