వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయకున్ని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh) ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి నిర్వహకులు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి వినాయకున్ని ప్రతిష్టించనున్నట్లు కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
మట్టి వినాయకున్ని ఇక మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నారు. పీవోపీ విగ్రహాలతో నీటి కాలుష్యం అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. మండపంలోనే నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించడంతో ఇక మహా గణపతి శోభాయాత్ర ఉండదని తెలుస్తోంది.
ఇదీ చదవండి : గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్