ETV Bharat / bharat

ఆందోళన చెందకండి.. ఆరోగ్యంగానే ఉన్నా: అమిత్​ షా - Amit Shah

I am totally healthy and not suffering from any disease, says Home Minister Amit Shah
తన ఆరోగ్యంపై అమిత్ ​షా క్లారిటీ
author img

By

Published : May 9, 2020, 4:18 PM IST

Updated : May 9, 2020, 5:27 PM IST

16:49 May 09

ఆందోళన చెందకండి.. ఆరోగ్యంగానే ఉన్నా: అమిత్​ షా

కొన్నిరోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇదే  క్రమంలో ఇటీవల ఆయన కొంత బలహీనంగా ఉన్నట్లు కనపడిన నేపథ్యంలో మరిన్ని సందేహాలు వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై స్పందించారు అమిత్​ షా. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

సామాజిక మాధ్యమాల్లో కొందరు తాను అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అమిత్‌షా ట్వీట్ చేశారు. ‘‘నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, నాకు ఎలాంటి జబ్బూ లేదన్నారు. గత కొన్ని రోజలుగా తన ఆరోగ్యం గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి తాను మరణించినట్లు కూడా ట్వీట్లు చేశారన్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తాను రాత్రి వరకు పనిలో నిమగ్నం అవడం వల్ల ఈ వార్తలను గుర్తించలేకపోయానన్నారు. ఆలస్యంగానైనా గుర్తించానని చెప్పకుకొచ్చారు. అయితే, వాళ్ల వదంతులను ఖండించడానికే ఈ పోస్టు పెట్టినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు, తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న వారికి విషయం చేర్చాలన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్​ చేస్తున్నట్లు అన్నారు.

నడ్డా స్పందన...

అమిత్​షా ఆరోగ్యంపై వదంతులను ఖండించారు భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా అన్నారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను వ్యాప్తి చేయడం తగదన్నారు.

16:14 May 09

తన ఆరోగ్యంపై అమిత్ ​షా క్లారిటీ

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Last Updated : May 9, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.