HC On R5 Zone: ఆర్-5 జోన్‌పై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతులు వేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అమరావతిలో 1,100 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో జారీ చేసిన ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి ఎందుకు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని భూములపై వేరేవారికి హక్కులు కల్పించకుండా ఆదేశించాలని..జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమరావతి రైతులు పిటిషన్ వేశారు. ఈ మేరకు రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: