Konijeti Rosaiah passed away : రాజకీయ కురువృద్ధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఇవాళ ఉదయం రోశయ్య పల్స్ పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయణ్ని హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం 8.20 గం.కు రోశయ్య మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేవీపీ వెల్లడించారు.
Konijeti Rosaiah Biography : రోశయ్య 1933 జులై 4న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ చదివారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా.. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో కొణిజేటి రోశయ్య తొలిసారి మండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1968, 1974, 1980లో కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యారు.
Konijeti Rosaiah Political Career : కాంగ్రెస్ సీఎంలందరి వద్ద రోశయ్య పలు కీలక శాఖలు నిర్వహించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
AP Former CM Konijeti Rosaiah : రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య.. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్‌గా సేవలందించారు.
Konijeti Rosaiah Death News : 1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి సర్కార్‌లో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు చేపట్టారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో మళ్లీ కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలను నిర్వర్తించారు. 2004, 2009లో వైఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1995-97 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
Konijeti Rosaiah Died : బడ్జెట్ కూర్పు, మాటల్లో నేర్పు రోశయ్య సొంతం. 2009లో రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించాక.. 2009, సెప్టెంబర్ 3న రోశయ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు సీఎంగా అధికారంలో కొనసాగారు.
2007లో రోశయ్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. 2018 ఫిబ్రవరి 11న లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడుగా పేరుతెచ్చుకున్న రోశయ్య.. నిబద్ధత, సౌమ్యత, విషయ స్పష్టతతో సేవలు అందించారు.
రోశయ్య నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు
1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు
1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ
1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు
1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
2004, 2009లో వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.
1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత..
- ఇదీ చదవండి : తెలుగువారికి వరం.. ఘంటసాల అమృతగానం