కాంగ్రెస్‌నేత శశిథరూర్‌కు దిల్లీ సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశిథరూర్‌పై ఉన్న అభియోగాలను సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా న్యాయస్థానానికి థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. 'గత ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులను ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు వాటి నుంచి ఉపశమనం లభించింది'అని ఆయన పేర్కొన్నారు.
దాదాపు ఏడేళ్ల క్రితం 2014, జనవరి 17న దిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది.
చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా థరూర్ ప్రవర్తించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.