ETV Bharat / crime

Accident News: పత్తి కూలీల ఆటో బోల్తా... పలువురికి తీవ్రగాయాలు - mahabubnagar district latest news

Accident News
Accident News: పత్తి కూలీల ఆటో బోల్తా... ఇద్దరు మృతి
author img

By

Published : Oct 18, 2021, 11:22 AM IST

Updated : Oct 18, 2021, 11:47 AM IST

11:20 October 18

పత్తి కూలీల ఆటో బోల్తా

వాళ్లు రెండు పూటలు తినాలంటే... కూలీ పనికి వెళ్లాల్సిందే. పిల్లలు స్కూల్​కు వెళ్లాలంటే... రోజూ పనికి పోవాల్సిందే. రోజూలానే ఈరోజు కూడా కూలీ పనులకు ఆటోలో బయలు దేరారు. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం పేరూరు వద్దకు రాగానే... పత్తి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూలీలు మదనపురం మండలం తిరునయ్యపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇవీ చూడండి: 

Last Updated : Oct 18, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.