ETV Bharat / state

బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా - corona positive for rs praveen kumar

corona-positive-to-bsp-leader-praveen-kumar
బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా
author img

By

Published : Aug 10, 2021, 2:04 PM IST

Updated : Aug 10, 2021, 3:04 PM IST

14:01 August 10

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్

బహుజన సమాజ్​ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్​ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. వైరస్​ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. తీసుకోవాల్సిన మందులు, ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ చేశారు. ​ప్రస్తుతం ప్రవీణ్​కుమార్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి.. సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు.

ఇదీ చూడండి: RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌

Last Updated : Aug 10, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.