మహారాష్ట్రలో 5...
భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోన్న మహారాష్ట్రలో మరో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 130కి చేరినట్లు ధ్రువీకరించింది మహారాష్ట్ర ఆరోగ్య శాఖ.
23:04 March 26

22:29 March 26
రాజస్థాన్నో మరో 5...
రాజస్థాన్‌లో మరో 5 కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 43కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.
21:59 March 26
5 లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్-19 కేసులు 5 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 5 లక్షల 542 మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 22 వేల 334గా ఉంది.
అమెరికాలో కొత్తగా 6771 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1078కి చేరింది. ప్రస్తుతానికి కేసుల సంఖ్యలో ఇటలీని దాటి.. చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది అగ్రరాజ్యం.
21:25 March 26
ఆర్థిక సంబంధమైన సమస్యలపై చర్చించడానికి, పరిష్కరించడానికిి జీ-20 సదస్సు ఒక మంచి వేదిక అని వ్యాఖ్యానించారు మోదీ. ఆర్థిక లక్ష్యాల కంటే, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
21:19 March 26
జీ20 వీడియోకాన్ఫరెన్స్‌లో మోదీ...
మానవ జీవితాలపై దృష్టి సారించే సరికొత్త ప్రణాళికలతో రావాలని జీ-20 సభ్యదేశాల నాయకులను కోరారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడం, డబ్ల్యూహెచ్‌ఓను బలోపేతం చేయడం, ఆర్థిక సమస్యలను తగ్గించడం వంటి ప్రణాళికలతో ముందుకు రావాలని ఆయన కోరారు.
21:14 March 26
ముంబయిలో మరొకరు..
కరోనా వైరస్‌తో తాజాగా దేశంలో మరో మరణం నమోదైంది. మహారాష్ట్రలోని ముంబయిలో 65 ఏళ్ల వృద్ధురాలు కొవిడ్-19 సోకి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధరించారు.
20:44 March 26
5 ట్రిలియన్ డాలర్లు...
కరోనాపై కలిసిగట్టుగా పోరాడాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. దీనితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 5 ట్రిలియన్ డాలర్లు సహాయం అందించనున్నట్టు తెలిపాయి. జీ20 దేశల అత్యవసర ఆన్లైన్ సదస్సు అనంతరం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాయి.
20:31 March 26
దేశంలో కరోనా మృతుల సంఖ్య 16కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 694గా నమోదైనట్లు స్పష్టం చేసింది.
18:38 March 26
అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోండి...
కరోనా వైరస్ నేపథ్యంలో జీ20 దేశాల అత్యవసర ఆన్లైన్ సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన సౌదీ రాజు సల్మాన్.. వైరస్ కట్టడికి ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవడం జీ20 దేశాల బాధ్యతగా అభివర్ణించారు సల్మాన్.
18:01 March 26
#WATCH West Bengal Chief Minister Mamata Banerjee seen directing officials and vendors to practice social distancing, in a market in Kolkata. #COVID19 pic.twitter.com/dwkDbvcraR
— ANI (@ANI) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH West Bengal Chief Minister Mamata Banerjee seen directing officials and vendors to practice social distancing, in a market in Kolkata. #COVID19 pic.twitter.com/dwkDbvcraR
— ANI (@ANI) March 26, 2020

ఇలా పాటించాలి...
కరోనాపై పోరులో సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. కేంద్రతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై విస్త్రతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒక అడుగు ముందుకేశారు. స్వయంగా తానే కోల్‌కతాలోని ఓ మార్కెట్‌కు వెళ్లి సామాజిక దూరంపై కూరగాయాల వ్యాపారుల్లో అవగాహాన కల్పించారు. ఇలా ఇటుకతో వృత్తాకారం గీసి అందరికీ వివరించారు.
17:08 March 26
ఫేస్ మాస్కులు...
నాన్ ఉలెన్ ఫేస్ మాస్కుల ధరను రూ.3 తగ్గించింది కేంద్రం. దీనితో ఇకపై మాస్కులు రూ.16కు అమ్ముడుకానున్నాయి. ఈ ధరలు జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
16:58 March 26
#WATCH Rajasthan Police punish youngsters for allegedly violating #CoronavirusLockdown in Pratapgarh. pic.twitter.com/OuLnLNcNF7
— ANI (@ANI) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH Rajasthan Police punish youngsters for allegedly violating #CoronavirusLockdown in Pratapgarh. pic.twitter.com/OuLnLNcNF7

కప్ప గంతులు...
దేశంలో 21రోజుల పాటు లాక్‌డౌన్ పాటిస్తోంది. కానీ అనేకమంది ఇంకా రోడ్లపై తిరుగుతున్నారు. వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని ఇలా 'కప్ప గంతుల'తో శిక్షించారు.
16:24 March 26
22వేలు దాటిన మృతుల సంఖ్య...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 22వేలు దాటింది. స్పెయిన్‌లో తాజాగా మరో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 4వేల 089కి చేరింది.
16:16 March 26
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియా సమావేశం...
కరోనా బాధితుల చికిత్స కోసం తమ అభ్యర్థన మేరకు 17 రాష్ట్రాలు ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించడానికి సన్నద్ధమవుతున్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు.
16:07 March 26
ఇరాన్లో ఆగని మరణ మృదంగం...
కరోనాతో ఇరాన్ విలవిలలాడుతోంది. రోజూ వందల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనాతో 157మంది మృతిచెందారు. మొత్తం 2వేల 234మంది ఇప్పటి వరకు మరణించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 2వేల 389 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి సంఖ్య 29వేల 406కు చేరింది.
15:55 March 26
ఇక ఇంటి వద్దకే ఔషధాలు...
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ దృష్ట్యా ఔషధాలను ఇంటి వద్దకే చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు త్వరలో ఓ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
15:25 March 26
దేశంలోనే తొలిసారిగా...
కరోనాపై పోరుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యిపడకల ఆసుపత్రిని శరవేగంగా నిర్మిస్తోంది. 14 రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. కరోనాకు చికిత్సలో దేశంలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి అని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తెలిపింది.
15:14 March 26
ఆర్థిక ప్యాకేజీపై రాహుల్ స్పందన...
ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.. కరోనాపై పోరులో తొలిసారి సరైన మార్గంవైపు అడుగులు వేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదులు, రైతులు, మహిళలు, రోజువారీ కూలిలకు... భారతదేశం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు.
14:52 March 26
#WATCH Rajwati, a daily wage labourer, at Delhi's Fatehpur Beri: We are surviving without food & water here. We request the government to help us. It is better to die of this disease (#COVID19) rather than dying of hunger. #CoronavirusLockdown pic.twitter.com/qa19hI7wVC
— ANI (@ANI) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH Rajwati, a daily wage labourer, at Delhi's Fatehpur Beri: We are surviving without food & water here. We request the government to help us. It is better to die of this disease (#COVID19) rather than dying of hunger. #CoronavirusLockdown pic.twitter.com/qa19hI7wVC

'ఆకలి కన్నా కరోనాతో చావడం మేలు...'
దిల్లీలోని ఓ రోజువారీ కూలీ.. తమకు ఆహారం లభించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహాయం చేయాలని అభ్యర్థించారు. ఆకలి కన్నా కరోనాతో చావడమే మేలని కన్నీరు పెట్టుకున్నారు.
14:45 March 26
భారత సైన్యం...
కరోనాపై పోరుకు సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది భారత సైన్యం. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటకు సరిపోయే ప్రాంతాలను అణ్వేషించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు పౌరులకూ అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. కరోనా ప్రభావం అధికం-తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. వైద్యుల మధ్య సమన్వయం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.
14:29 March 26
కరోనాతో మరో వ్యక్తి...
రాజస్థాన్‌లోని బిల్వారాలో 73ఏళ్ల వృద్ధుడు మరణించాడు. కో-మార్బిడిటీ వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 40 మందికి వైరస్ సోకింది.
14:20 March 26
కేంద్రం 'కరోనా ప్యాకేజీ'తో మీకు కలిగే లాభాలివే....
కరోనా విజృంభణ, లాక్‌డౌన్ నేపథ్యంలో.. పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి అండగా నిలిచేందుకు కీలక చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం పేరిట రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది. పేదలకు ఆపన్న హస్తం అందిస్తూ 3 నెలలపాటు ఉచిత రేషన్, వంటగ్యాస్ సహా మరెన్నో ప్రకటనలు చేసింది. వైద్యులు, వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించిన విశేషాలు....
14:08 March 26
'ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు...'
కార్మికుల సంక్షేమం...
13:56 March 26
'ఈపీఎఫ్ చందా ప్రభుత్వమే చెల్లిస్తుంది...'
13:53 March 26
3 నెలల్లో మూడు గ్యాస్ సిలిండర్లు...
13:45 March 26
'5 కోట్ల కుటుంబాలకు లబ్ధి'
13:35 March 26
నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలోని మరిన్ని అంశాలు...
13:29 March 26
వైద్యులకు ప్రత్యేక బీమా...
13:24 March 26
ఆర్థిక ప్యాకేజీ...
కరోనాపై పోరుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలోని మరిన్ని అంశాలు.
13:22 March 26
కర్ణాటకలో...
కర్ణాటకలో బుధవారం మరణించిన ఓ వృద్ధురాలికి కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయ్యింది. దీనితో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరింది.
13:19 March 26
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు...
దేశంలో ఇప్పటివరకు 649కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13:14 March 26
నొయిడాలో మరో ముగ్గురికి కరోనా
నొయిడాలో మరో ముగ్గురికి కరోనా సోకింది. ఫలితంగా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 14కు చేరింది.
13:05 March 26
ప్రతి ఒక్కరికీ 7 కిలోల సబ్సిడీ ఆహారధాన్యాలు
దేశ వ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రతి ఒక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు సబ్సిడీగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆహారశాఖ స్పష్టం చేసింది. పీడీఎస్ ద్వారా అదనంగా 2 కిలోలను జోడించి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
12:56 March 26
12:44 March 26
నిర్మలమ్మ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి
కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోమారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 2019 ఆదాయపన్నుల రిటర్నులు దాఖలు, ఆధార్-పాన్ లింక్, వివాద్ సే విశ్వాస్ పథకం, మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ దాఖలు చివరి తేది జూన్ 30 వరుక పొడిగిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేసిన నిర్మల.. తాజాగా ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
12:05 March 26
#WATCH South Delhi Municipal Corporation conducts sanitisation in Lajpat Nagar, in wake of Coronavirus spread; Local Councilor Abhishek Dutt appeals to people to stay indoors . #Delhi pic.twitter.com/dUwCxRZaZY
— ANI (@ANI) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH South Delhi Municipal Corporation conducts sanitisation in Lajpat Nagar, in wake of Coronavirus spread; Local Councilor Abhishek Dutt appeals to people to stay indoors . #Delhi pic.twitter.com/dUwCxRZaZY

శానిటైజేషన్...
21రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు శానిటైజేషన్‌పై దృష్టి సారించాయి. తాజాగా దక్షిణ దిల్లీలోని లాజ్పథ్ నగర్లో శానిటైజేషన్ చేపట్టారు అధికారులు. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని మరోమారు విజ్ఞప్తి చేశారు.
11:47 March 26
1 గంటకు...
ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం జరపనున్నారు. కరోనాపై పోరుకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని దేశప్రజలు భావిస్తున్నారు.
11:42 March 26
గుజరాత్లో మరొకరు మృతి...
దేశంలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్‌లోని ఓ 70ఏళ్ల వృద్ధుడు వైరస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3కు చేరింది.
11:35 March 26
'లాక్‌డౌన్‌కు మద్దతు...'
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. 21రోజుల లాక్‌డౌన్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. దేశంలో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని ఈఎమ్ఐలనూ 6 నెలల పాటు నిలిపివేయాలని మోదీకి సోనియా సూచించారు. బ్యాంకులు వడ్డీ ఛార్జ్ చేయకూడదని తెలిపారు.
11:22 March 26
దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రాణాంతక మహమ్మారితో ఇప్పటి వరకు 13మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 649మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. వీరిలో 42మంది కరోనాను జయించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
జమ్ములో తొలి మరణం...
గురువారం జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. శ్రీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో 65ఏళ్ల వృద్ధుడు.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కలిసిన నలుగురికీ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. దీనితో జమ్ముకశ్మీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. మరో 5వేల 124 మందిపై నిఘా పెట్టారు.
అయితే.. కేసుల సంఖ్యపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మంది తమ విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించడం లేదని.. దీని వల్ల కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలోని ముంబయిలో ఈ నెల 24న మృతిచెందిన ఓ మహిళ రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ముంబయిలో చికిత్స పొందుతున్న ఓ 65ఏళ్ల వృద్ధురాలు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. వైరస్ పాజిటివ్‌గా తేలినప్పటికీ... మృతిచెందడానికి గల కారణాలను పరిశీలిస్తునట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
పెరుగుతున్న కేసులు...
మధ్యప్రదేశ్‌లో తాజాగా మరో ఐదుగురు కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 20కి చేరింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. వైరస్ కట్టడికి కిఠన చర్యలు తీసుకుంటోంది.
మొహల్లా క్లినిక్ వైద్యుడికి...
దిల్లీలో మొత్తం 36మందికి వైరస్ సోకింది. వీరిలో మొహల్లా క్లినిక్ డాక్టర్ ఒకరు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళను కలిసినందు వల్లే వైద్యుడికి వైరస్ సోకిందని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. డాక్టర్‌తో పాటు మరో నలుగురికీ వైరస్ సోకిందన్నారు. అయితే వైద్యుడిని కలిసిన దాదాపు 800మందిని 14రోజుల పాటు క్వారంటైన్ చేసినట్టు స్పష్టం చేశారు.
11:12 March 26
మరో ఇద్దరు!
ముంబయిలో చికిత్స పొందుతున్న ఓ 65ఏళ్ల వృద్ధురాలు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. వైరస్ పాజిటివ్‌గా తేలినప్పటికీ... మృతిచెందడానికి గల కారణాలను పరిశీలిస్తునట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో వైరస్ అనుమానిత వ్యక్తి మరణించాడు. మృతికి గల కారణాలను వైద్యులు పరిశీలిస్తున్నారు.
10:37 March 26
13కు చేరిన మృతులు...
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటి వరకు 13మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 649కి చేరింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
10:32 March 26
భయంతో ఆత్మహత్య..
కరోనా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. వైరస్ సోకుతుందనే భయంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. వైరస్ లక్షణాలపై అనేక అనుమానాలున్నాయి. తుమ్ములు వస్తుంటేనే వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.
56ఏళ్ల గోపాల కృష్ణ మదివల.. ఉడిపిలోని ఉప్పూర్ గ్రామవాసి. ఈ రోజు తెల్లవారుజామున అతడి మృతదేహం ఓ చెట్టుకు వేలాడటం చూసి కుటుంబ సభ్యులు విలపించారు. తమతో ఆర్థరాత్రి 2గంటల వరకు గోపాల్ కృష్ణ మాట్లాడాడని వారు తెలిపారు.
కరోనా సోకిందనే అనుమానంతోనే ప్రాణాలు విడుస్తున్నట్టు రాసి ఉన్న ఓ లేఖ.. గోపాల కృష్ణ ఇంట్లో దొరికింది. అయితే అతడిలో వైరస్ లక్షణాలు అసలు కనపడలేదని సమాచారం.
10:13 March 26
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో ఈ నెల 24న మరణించిన ఓ మహిళకు కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయ్యింది. దీనితో ఆ రాష్ట్రంలో వైరస్‌తో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
10:02 March 26
Shimla: People outside a shop stand at a distance from each other as they practice social distancing. #Coronavirus pic.twitter.com/Ej0Hg2jRFu
— ANI (@ANI) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Shimla: People outside a shop stand at a distance from each other as they practice social distancing. #Coronavirus pic.twitter.com/Ej0Hg2jRFu

గుంపు వద్దు.. సామాజిక దూరం ముద్దు..
కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే సామాజిక దూరం పాటిస్తే కరోనా మన దరి చేరదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఓ దుకాణం వద్ద ప్రజలు ఇలా సామాజిక దూరం పాటించారు.
09:50 March 26
మహారాష్ట్రలో మరో రెండు...
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవి ముంబయి, ఠానేకు చెందినవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
09:26 March 26
శ్రీనగర్‌లో తొలి మరణం...
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 606 కేసులు నమోదయ్యాయి.
09:01 March 26
అమెరికాలో 1000 దాటిన కరోనా మృతులు..
అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 1000 దాటింది. 65 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం:
మృతులు: 1,031
కేసులు: 68,572
చైనా, ఇటలీ తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా నిలిచింది అమెరికా.
08:48 March 26
5 లక్షలు దాటిన కరోనా కేసులు.. అమెరికాలోనే తీవ్రం
మధ్యప్రదేశ్‌లో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20కి చేరింది.