ETV Bharat / bharat

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు.. 8ఏళ్లు ఎన్నికలకు దూరం! - రాహుల్​ గాంధీ మోదీ కేసు

rahul gandhi
రాహుల్​ గాంధీపై అనర్హత వేటు
author img

By

Published : Mar 24, 2023, 2:20 PM IST

Updated : Mar 24, 2023, 5:18 PM IST

14:17 March 24

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు.. 8ఏళ్లు ఎన్నికలకు దూరం!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు పడింది. వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ప్రజాప్రతినిధులు ఎవరికైనా రెండేళ్లకుపైగా శిక్ష పడితే వెంటనే పదవికి అనర్హులవుతారు. అలా అనర్హతకు గురైన వ్యక్తి.. రానున్న 8 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే వీలు లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైలు శిక్షకాలంతో పాటు మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల బరిలో దిగేందుకు అనర్హులు. మోదీ పరువు నష్టం కేసులో రాహుల్​కు గుజరాత్​లోని సూరత్​ న్యాయస్థానం రెండేళ్లు కారాగార శిక్ష విధించింది. ఆ శిక్ష కాలం పూర్తయ్యాక.. మరో 6 సంవత్సరాలకు ఎన్నికలకు రాహుల్ దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మండిపడ్డ కాంగ్రెస్​
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన అనర్హత వేటుపై న్యాయపోరాటంతో పాటు రాజకీయంగాను పోరాడుతామని చెప్పింది. దీనిపై తాము భయపడేదిగానీ, మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది. ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని భాజపా సర్కార్ నొక్కుతోందని జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్‌గాంధీని సభనుంచి వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్​.. బలహీనవర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని.. లలిత్‌ మోదీ.. నీరవ్‌మోదీ.. వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టుబడుతున్నందుకే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. రాహుల్‌ అనర్హత వేటు అంశంపై ఎంతవరైనా పోరాడతామని స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని సభ నుంచి గెంటేస్తున్నారని దుయ్యబట్టారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశం అవుతామని వెల్లడించారు. అదానీ మహామెగాస్కామ్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించడానికి బదులు రాహుల్‌గాంధీపై అనర్హత వేటువేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. భారత ప్రజాస్వామ్యం ఓం శాంతి అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీపై ఇంత వేగంగా అనర్హత వేటు వేయడంపై సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చట్టం ముందు అందరూ సమానమే : బీజేపీ
రాహుల్‌గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడంపై భాజపా స్పందించింది. రాహుల్‌పై అనర్హత వేటును కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి SPS బఘేల్ సమర్థించారు. లోక్‌సభ సచివాలయం తీసుకున్న నిర్ణయం చట్టం ప్రకారమే ఉందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని బఘేల్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్ కేసులో శిక్షపడిన భాజపా MLAపైనా అనర్హత వేటు పడిందని గుర్తుచేశారు. అనర్హత నిర్ణయం చట్టపరమైందని.. కాంగ్రెస్‌ పార్టీ న్యాయవ్యవస్థనే ప్రశ్నిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అన్ని నిబంధనలు అనుసరించిన తర్వాత అనర్హత వేటు వేశారని.. బీజేపీ సీనియర్ నేత భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఘటనపై వివరణ ఇచ్చుకునేందుకు రాహుల్‌కు ఎన్నో అవకాశాలున్నాయని సరైన ఆధారాలు సమర్పించుకోవచ్చని సూచించారు.

ఇదీ కేసు..
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో జరిగిన సభలో మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్‌ మోదీని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీకి ముడిపెట్టారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఫలితంగా రాహుల్​పై ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదైంది. ఈ కేసుపై విచారించిన సూరత్​లోని న్యాయస్థానం ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఐపీసీ సెక్షన్​ 504 ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా అవమానించారని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ స్పష్టం చేశారు. ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పును ఇచ్చారు. ఈ తీర్పుపై పైకోర్టుకు అప్పీల్​ చేసుకునేందుకు తనకు బెయిల్​ మంజూరు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ​ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. శిక్ష అమలును 30 రోజులు సస్పెండ్ చేసింది.

పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీకే శిక్ష గురువారమే ఖరారైంది. ఎగువ న్యాయస్థానంలో అపీల్ చేసుకునేందుకు వీలుగా సూరత్ కోర్టు 30 రోజులు బెయిల్ ఇచ్చింది. అప్పటివరకు శిక్ష అమలును నిలుపుదల చేసింది. అయితే.. అనూహ్యంగా 24 గంటలలోపే రాహుల్​పై అనర్హత వేటు పడింది. లోక్​సభ సచివాలయం ఇంత వేగంగా చర్యలు తీసుకోవడం వెనుక ఓ మహిళ కృషి దాగి ఉంది. ఆమె ఎవరు? ఏం చేశారు? ఆమె పోరాటంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు ఎలా మారాయో తెలుసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Mar 24, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.