ETV Bharat / bharat

చంబల్​ పడవమునక ఘటనలో 12 మంది మృతి - कोटा में नाव डूबी

कोटा के इटावा से एक बड़ी खबर सामने आई है. यहां कलमेश्वर धाम के दर्शन करने जा रहे 25 से 30 लोगों से भरी नांव चंबल नदी में डूब गई.

Boat sunk in Chambal river
చంబల్​ నదిలో పడవమునక-పలువురు గల్లంతు?
author img

By

Published : Sep 16, 2020, 10:18 AM IST

Updated : Sep 16, 2020, 2:27 PM IST

12:55 September 16

చంబల్​ నదిలో పడవమునక-పలువురు గల్లంతు?

రాజస్థాన్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియరాలేదు. వారు కూడా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బూందీ జిల్లాలోని కమలేశ్వర్‌ మహాదేవ్​ ఆలయానికి సుమారు 40 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. 20 నుంచి 25 మంది దాకా.. ఈదుకుంటూ నదీతీరానికి చేరుకున్నారు. మిగతా వారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. 

12:27 September 16

8కి చేరిన మృతులు..

చంబల్​ పడవ మునక ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది. 

11:25 September 16

పడవమునిగిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 20-25 మంది ఈదుకుంటా ఒడ్డుకు చేరుకోగా.. మరో 10 మందికిపైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరి కోసం ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది గాలిస్తున్నారు. 

09:59 September 16

చంబల్​ నదిలో పడవమునక-ఐదుగురు మృతి

చంబల్​ నదిలో పడవమునక-పలువురు గల్లంతు?

రాజస్థాన్​లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో దాదాపు 50 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. వీరంతా బూందీ ప్రాంతంలోని కమలేశ్వర్​ ధామ్​ చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు నదిలో దూకి కొంతమందిని రక్షించారు. కొంతమంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Sep 16, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.