ETV Bharat / bharat

శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా - health ministry

amit shah admitted aims
శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా
author img

By

Published : Aug 18, 2020, 10:34 AM IST

Updated : Aug 18, 2020, 11:22 AM IST

11:15 August 18

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న షా ఎయిమ్స్‌లో చేరారని.. ఎయిమ్స్ ఆసుపత్రి హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది.  డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమిత్‌ షా ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆసుపత్రి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

ఇటీవల కొవిడ్ సోకడంతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో అమిత్ షాకు చికిత్స అందించారు. మరోసారి పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు ఈ నెల 14న అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. తాజాగా శ్వాస ఇబ్బందులతోపాటు రెండు మూడు రోజులగా ఒంటి నొప్పులు కూడా రావడంతో అమిత్ షా ఎయిమ్స్‌లో చేరారని వైద్యులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు.. ఆయన మరికొన్ని రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. 

10:50 August 18

amit-shah-admitted-aims
షా ఆరోగ్యంపై ఆసుపత్రి క్లారిటీ

ఆసుపత్రి బులెటిన్​ విడుదల..

అమిత్​ షా ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్​ విడుదల చేసింది ఎయిమ్స్​ ఆసుపత్రి. గత 4-5 రోజులుగా స్వల్ప అస్వస్థత(అలసట), ఒళ్లు నొప్పులతో షా.. ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమిత్​ షా.. ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచే విధులు నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు వైద్యులు. 

10:33 August 18

శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

శ్వాసకోశ సమస్యతో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. 

ఇటీవల కొవిడ్ సోకడంతో గురుగ్రామ్​లోని మేదాంత ఆసుపత్రిలో అమిత్ షాకు చికిత్స అందించారు. ఆగస్టు 14న కరోనాను జయించిన ఆయన.. డిశ్చార్జి అయ్యారు. తాజాగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. డా. రణదీప్​ గులేరియా నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నారు అమిత్​ షా. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Aug 18, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.