ETV Bharat / state

దళితబంధు పథకం అమలుకు అదనపు విధివిధానాలు - telangana varthalu

దళితబంధు పథకం అమలుకు అదనపు విధివిధానాలు
దళితబంధు పథకం అమలుకు అదనపు విధివిధానాలు
author img

By

Published : Oct 2, 2021, 6:45 PM IST

Updated : Oct 2, 2021, 7:33 PM IST

18:43 October 02

దళితబంధు పథకం అమలుకు అదనపు విధివిధానాలు

దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు విధివిధానాలు జారీ చేసింది. మార్గదర్శకాలు ప్రకటిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని... సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని తెలిపింది. ఆ ఖాతాలోకి 9.90 లక్షల రూపాయలను కలెక్టర్ బదిలీ చేయాలని పేర్కొంది. లబ్దిదారులను వారు ఆసక్తి కనబరిచే యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరించాలని... వ్యవసాయం-అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ-పరిశ్రమల రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు-సరఫరా రంగంగా విభజించాలని తెలిపింది. 

ఎక్కువ మంది కలిస్తే పెద్ద యూనిట్​కు అవకాశం

ఆయా రంగాల వారీగా రీసోర్స్ పర్సన్స్​ను ఎంపిక చేయడంతో పాటు బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పదిలక్షల రూపాయల యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రీసోర్స్ బృందాలు రూపొందించాలి. మొత్తం పది లక్షలు విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఒకరి కంటె ఎక్కువ మంది లబ్దిదారులు కలిసి ఎక్కువ మొత్తంతో పెద్ద యూనిట్​కు కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. 

లబ్ధిదారులకు శిక్షణ

రీసోర్స్ బృందాలతో కలెక్టర్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి వివిధ యూనిట్లపై అవగాహన కల్పించాలి. అవసరమైతే రీసోర్స్ బృందాలు ఎక్కువమార్లు కూడా లబ్ధి దారుల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను యూనిట్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ల ఖరారు అనంతరం వారికి అందులో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 

కలెక్టర్ సంతృప్తి చెందితేనే...

ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల దృష్ట్యా రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల పనితీరు పరిశీలన కోసం పర్యటనలు ఏర్పాటు  చేయాలని, ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్​పై పూర్తి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమైనట్లు కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్​ను వారికి అందించాలని తెలిపింది. 

మంజూరు అనంతరం కూడా యూనిట్ల నిర్వహణలో రీసోర్స్ బృందాలు లబ్ధిదారులకు తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా ప్రతిదశలోనూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, బృందాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Etela Rajender Speech: 'కేసీఆరే కాదు.. ఆయన జేజమ్మ వచ్చినా నన్ను ఓడించలేరు'

Last Updated : Oct 2, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.