కర్ణాటక బెంగళూరులో జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేసినట్లు మేకప్ ఆర్టిస్ట్ హితేషా చంద్రనీ ఆరోపించారు. దాడికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు తన ఇంటికి వచ్చిన జొమాటో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా తనపై దాడి చేసినట్లు హితేషా ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన జోమాటో యాజమాన్యం ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: కన్నబిడ్డనే కడతేర్చిన తల్లి- కారణమదేనా?