ETV Bharat / bharat

కేరళలో జికా వైరస్​ విజృంభణ- మరో ముప్పుగా మారేనా?

కరోనాతో సతమతం అవుతున్న సమయంలో కేరళలో జికా వైరస్​ వ్యాప్తి కలకలం రేపుతోంది. కొత్తగా 14 కేసులు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

zika virus in kerala, దేశంలో జికా వైరస్
కేరళలో పెరుగుతున్న జికా వ్యాప్తి
author img

By

Published : Jul 9, 2021, 1:25 PM IST

కేరళలో జికా వైరస్​ వ్యాప్తి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో 14 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు కావడం గమనార్హం.

జికా తొలి కేసు తిరువనంతపురంలోని పరస్సాలలో నమోదైంది. ఓ 24 ఏళ్ల గర్భిణికి వైద్యులు గురువారం పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఈ వైరస్​ సోకినట్లు వెల్లడైంది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డలో వైరస్‌ లక్షణాలు లేనందున వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఆసుపత్రిలోని 19 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు జికా వైరస్​ లక్షణాలని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్​కు మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

ఇదీ చదవండి : గంగా నదిలో కరోనా- కొత్త ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.