ETV Bharat / bharat

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ - bjp news

Four YCP MLAs suspended: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌‌కు పాల్పడ్డారన్న కారణంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు ఇచ్చి, వారిని కొన్నట్లు తమకు సమాచారం అందిందని, ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టాన్ని కల్గిస్తాయని.. ఇలాంటి రోగ కారణాన్ని తక్షణమే గుర్తించి తమ పార్టీ అధ్యక్షుడు వారిని సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని సజ్జల మీడియాకు తెలిపారు.

ycp mlas suspended
ycp mlas suspended
author img

By

Published : Mar 24, 2023, 5:09 PM IST

Updated : Mar 24, 2023, 7:21 PM IST

Four YCP MLAs suspended: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమెకు మొత్తం 23 ఓట్లు రావడంతో ఘన విజయం సాధించారు. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలే ఉండగా.. ఆమెకు 23 ఓట్లు పోలవ్వడం సంచలనంగా మారింది. దీంతో ఆ మిగతా నాలుగు ఓట్లు ఎలా వచ్చాయి?, ఎవరు వేశారు? అన్న దానిపై వైసీపీ అధిష్ఠానం లోతైన దృష్టి సారించింది.

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సెస్పెండ్: ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంగా వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నేడు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు ఇచ్చి, వారిని కొన్నట్లు తమకు సమాచారం అందిందని, ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టాన్ని కల్గిస్తాయని.. ఇలాంటి రోగ కారణాన్ని తక్షణమే గుర్తించి తమ పార్టీ అధ్యక్షుడు వారిని సస్పెన్షన్ చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారని సజ్జల తెలిపారు.

ఈ వ్యవహారం ఏ పార్టీకైనా నష్టాన్ని కల్గిస్తుంది: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ అధిష్ఠానం చర్యలకు దిగింది. అందులో ఆనం రామనారాయణ రెడ్టిని, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిని, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితోపాటు ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. పది కోట్ల నుంచి రూ.పదిహేను కోట్లను ఇచ్చి చంద్రబాబు నాయుడు వారిని కొనుగోలు చేశారని మాకు సమాచారం అందింది. ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా తీవ్రమైన నష్టాన్ని కల్గిస్తాయి. రోగ కారణాన్ని తక్షణమే గుర్తించి ఇలాంటి వాటిని తొందరగా తొలగించుకోవాలి. అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరం. అందుకే వారితో అవసరం లేదని తొలగించాం. అంతేకాదు, ఆ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని పార్టీ దృఢంగా నమ్మింది కాబట్టే వారిని త్వరగా సస్పెండ్‌ చేయాలని నిర్ణయించాము. కేవలం అసంతృప్తి వల్ల ఎవరూ బయటకు వెళ్లిపోరు. ప్రలోభాలకు గురిచేస్తేనే వారు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మిగతా వాళ్లందరూ మాపై అభిమానంతోనే పార్టీలోకి వచ్చారు. వాళ్లు టీడీపీ నుంచి బయటకు రావడానికి ఆ పార్టీలో అసంతృప్తే కారణం.’’ అని సజ్జల అన్నారు.

పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల విషయానికొస్తే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా ఘన విజయం సాధించారు. మొత్తం 23 ఓట్లు దక్కించుకుని ఆమె ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 23 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత టీడీపీ తరుపున గెలిచిన నలుగురు సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 19 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నిన్న వెలువడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లను సాధించి జయకేతనం ఎగరేశారు. మొదట్లోనే టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను లాక్కున్న వైసీపీకి... ఆ పార్టీలోనివారే అసంతృప్తులుగా మారి ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థినికి ఓటు వేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణ పేరుతో ఈరోజు ఆ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి

Last Updated : Mar 24, 2023, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.