ETV Bharat / bharat

సీఎం జగన్ ఎదుటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం

YSRCP MLAs Reverse on CM Jagan: నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులతో అధికాల వైఎస్సార్సీపీలో ధిక్కార గళం మరింత పుంజుకుంది. వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని నేతలు తెగేసి చెబుతున్నారు.

YSRCP_MLAs_Reverse_on_CM_Jagan
YSRCP_MLAs_Reverse_on_CM_Jagan
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 6:48 AM IST

సీఎం జగన్ ఎదుటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం

YSRCP MLAs Reverse on CM Jagan : నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులతో అధికార వైఎస్సార్సీపీలో ధిక్కార గళం మరింత పుంజుకుంది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేల స్వరం పెంచుతున్నారు. తమ అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్న నేతలు వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని తెగేసి చెబుతున్నారు.

CM Jagan Changing Constituency Incharge : అధికార వైఎస్సార్సీపీలో కాకరేగింది. ఇంతకాలం సజ్జల రామకృష్ణారెడ్డి, YVసుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే కుండబద్దలు కొడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutvam) అంటూ ఇల్లిల్లూ తిరిగాం. చెప్పిందల్లా చేశాం. అయినా ఇప్పుడు పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకుంటే ఎలా అని కొందరు నేరుగా సీఎంని, మరికొందరు పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు.

'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి

వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా? మీకో దండం అంటూ సీఎం బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy) వెళ్లిపోయారు. రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ పోటీచేసి తీరతామంటూ జగన్‌కు సవాలు విసిరారు. ప్రకాశం జిల్లా దర్శిలో సిటింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ (Maddisetty Venu Gopal) స్థానంలో ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై వేణు గోపాల్ సీఎంను శుక్రవారం కలిసి మాట్లాడారు. టికెట్ ఇవ్వకపోతే ఎం చేయాలో ఆలోచిస్తానని బయటకొచ్చాక ఆయన తేల్చి చెప్పారు.

ఇన్‌ఛార్జుల మార్పుపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి- పనిచేయని బుజ్జగింపులు- పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు

ఒక ఎంపీ శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి బంధువైన మాజీ మంత్రిని కలిశారు. తన టికెట్ విషయంలో ఆ మాజీ మంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను కలిసిన ఎంపీ కూడా తన టికెట్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. వారిద్దరూ కలిసి రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. ప్రత్యర్థి పార్టీ తరపున తాను, తన కుమారుడు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకు ఆ మాజీమంత్రి కూడా తన టికెట్ విషయం తేలకపోతే తానూ అదే దారిలో వస్తానని చెప్పినట్లు తెలిసింది.

వైఎస్సార్సీపీకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడొకరు ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆయన అడిగిన మార్పులు చేసేందుకు సీఎం అంగీకరించలేదు. దీనిపై ఆయనా ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నా రని, ఒకవేళ ఆయన వస్తానంటే తాను తప్పుకొని, ఆయనకు అవకాశం ఇస్తానని మాజీమంత్రిని కలిసిన ఎంపీ చెప్పారు. ప్రతిపక్ష నేతలను తిట్టనని చెప్పిన ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

అధికారపక్షాన్ని వీడుతున్న నేతలు - వైసీపీలో అలజడికి కారణం ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.