YSRCP Ministers Reacting to Chandrababu Naidu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ మంత్రులు మీడియా సముఖంగా ఆరోపణలు గుప్పించారు. అధికారులు అన్ని విధాలుగా విచారించిన తర్వాతే.. చంద్రబాబును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి.. చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
Minister Peddireddy Ramachandra Reddy comments: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై రాష్ట్ర విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను (చంద్రబాబు) రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ పూర్తి సమాచారాన్ని వెల్లడించారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిందని మంత్రి వెల్లడించారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
IT Minister Gudiwada Amarnath comments చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజాధనాన్ని వాడుకున్నారని.. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం విషయంలో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''పబ్లిక్ సర్వెంట్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలే తీసుకున్నాం. సీమెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ. షెల్ కంపెనీలతో ఎంవోయూలు అంటూ డ్రామా నడిపారు. చంద్రబాబు చెప్పిన ఏ కంపెనీ రాష్ట్రానికి రాలేదు. ఆయన చేసిన దోపిడీకి చంద్రబాబు సమాధానం చెప్పాలి.'' అని మంత్రి వ్యాఖ్యానించారు.
Education Minister Botsa Satyanarayana comments చంద్రబాబు అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకువెళుతుందని.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారులు అన్ని విధాలుగా విచారించినా తర్వాతే ఆయనను అరెస్టు చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. లోకేశ్ సహా ఎవరి పాత్ర ఉన్నా విచారణలో తేలుతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
TDP Leaders Fire on Chandrababu Illegal Arrest మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ పార్టీ నాయకుడిని అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.