ETV Bharat / bharat

YSRCP leaders Atrocity ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైసీపీ నేతల దాష్టికం.! నగ్నంగా కూర్చోబెట్టి.. కటింగ్‌ప్లేయర్‌తో నొక్కి పట్టి

YSRCP activists Attack on Three Persons: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎవరేమి అనరనే ధైర్యంతో విర్రవీగుతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా నోరులేని అభాగ్యులపై ఘోరంగా దాడులకు దిగుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరమలలో జరిగిన ఓ అమానవీయ ఘటన.. సభ్య సమాజాన్నే తల దించుకునేలా చేసింది.

YSRCP activists Attack on Three Persons
YSRCP activists Attack on Three Persons
author img

By

Published : Jul 29, 2023, 10:58 AM IST

YSRCP activists Attack on Three Persons in Eluru district: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యథేచ్చగా దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమను అడ్డుకునే వారు లేరని ఇష్టారాజ్యానికి పాల్పడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసి.. తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ అమానవీయ ఘటన.. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని నిశ్చేష్టులను చేసింది. కోళ్లు దొంగతనం పేరుతో.. ముగ్గురు వ్యక్తులను దారుణంగా కొట్టి, వారి మర్మాంగాలను కటింగ్ ప్లేయర్​తో నొక్కి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన బాధితుల ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Atrocity in Eluru district: తిమ్మాపురం గ్రామానికి చెందిన ముప్పిన సురేష్‌, అరటికట్ల రాంబాబుతోపాటు ఓ దళిత బాలుడిని ఈ నెల 25వ తేదీ రాత్రి.. అదే గ్రామానికి చెందిన అప్పసాని ధర్మారావు, కొనకళ్ల అప్పారావు, ఆచంట రాకేష్‌, ఘంటా శేఖర్‌, తోకల సిద్ధిరాజు, మురుగుల దుర్గారావులు పని ఉందని చెప్పి వాళ్లు నాటు కోళ్లు పెంచే తోటలోకి తీసుకెళ్లారు. మా కోళ్లను దొంగిలించింది మీరేనా అని గద్దిస్తూ, దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. చుట్టు పక్కల వాళ్లు చూస్తుండగానే కర్రలు, ప్లాస్టిక్‌ పైపులతో వాళ్లను కొట్టి, చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులున్న చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన దళిత బాలుణ్ని కులం పేరుతో దూషించారు. ‘మా కోళ్లనే దొంగతనం చేస్తావా.. ఈ రోజు మా చేతుల్లో చచ్చిపోతావ్‌’ అంటూ భయాందోళనకు గురిచేశారు.

అందరూ చూస్తుండగానే దుస్తులు తీయించి కటింగ్‌ ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి.. చేతిపై చర్మాన్ని కట్​ చేశారు. ఈ విషయంపై అరటికట్ల రాంబాబు, ముప్పిన సురేష్‌ గురువారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్ని పోలీసులు ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి.. విచక్షణరహితంగా కొట్టడం వల్లే గాయాలు అయ్యాయని నిర్ధారించడంతో నిందితులైన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ద్వారకా తిరుమల ఎస్సై సుధీర్‌ తెలిపారు. ముగ్గురిని అర్ధ నగ్నంగా నిలబెట్టి కర్రలతో దాడి చేశారని, అయితే బాలుడి మర్మాంగాలపై దాడి చేసిన ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. కాగా తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

రాజీకి వైసీపీ నేతల ప్రయత్నం: నిందితులు అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉండటంతో.. కేసు నమోదు చేసేందుకు పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడం.. నిందితులపై కేసు నమోదు చేయకతప్పలేదనే వాదన వినిపించింది. దీంతో కేసు తీవ్రతను తక్కువగా చేసేందుకు, స్థానిక అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. బాధితులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు కొందరు నేతలు శుక్రవారం ప్రయత్నాలు చేశారు. ఓ ప్రజాప్రతినిధి ద్వారా కూడా సెల్‌ఫోన్‌లో చెప్పించేందుకు ప్రయత్నించారు. బాధితులు ఒప్పుకోకపోవటంతో కేసు నమోదైంది.

YSRCP activists Attack

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.