ETV Bharat / bharat

YS Sharmila Meets Sonia Gandhi : సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ.. కాంగ్రెస్​లో YSRTP విలీనం ఖాయమేనా..? - కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీనం

YS Sharmila Meets Sonia Gandhi : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గద్దె దిగడం ఖాయమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్​కు కౌంట్ డౌన్ షురూ అయిందని తెలిపారు. దిల్లీలో ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో.. సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

YS Sharmila Meets Sonia Gandhi
YS Sharmila
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 11:19 AM IST

Updated : Aug 31, 2023, 3:06 PM IST

YS Sharmila Meets Sonia Gandhi : రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పార్టీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జింపింగ్ చేస్తుంటే.. మరికొన్ని పార్టీల్లో కీలక నేతలు గూడు వీడుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే చేరికలపై ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి.

YS Sharmila with CBI 'జగన్ నాకు మద్దతు ఇవ్వడని ముందే తెలుసు..! పైపైకి బాగానే ఉన్నా.. లోపల కోల్డ్ వార్!'

YS Sharmila Meets Rahul Gandhi : ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా రాజన్న రాజ్యం తీసుకురావాలనే నినాదంతో వచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీ రాష్ట్రంలో పాగా వేసేలా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓవైపు చేరికలు.. పార్టీ బలోపేతంపై షర్మిల స్పెషల్ ఫోకస్ పెడుతూనే.. ముఖ్యమంత్రి కేసీఆర్​ను మూడోసారి గెలవకుండా.. గద్దె దించేందుకు తనతోటి కలిసి నడవాలని వామపక్ష, ప్రతిపక్ష పార్టీలను షర్మిల కోరుతున్నారు.

YSRTP Merges in Congress : ఇలా తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిల చర్చలు జరుపుతుంటే కొంతకాలంగా ఈ పార్టీకి సంబంధించి ఓ వార్త రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం చేస్తోంది. అదేంటంటే.. వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్​లో విలీనం చేస్తారని. ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా షర్మిల.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం దిల్లీలో ఆమె వారిని కలవడంతో కాంగ్రెస్​లో వైఎస్సార్టీపీ విలీనం దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది.

YS Sharmila Tweet Today : 'రాహుల్ జీ.. థ్యాంక్యూ.. రాజశేఖర్​రెడ్డిని మీ గుండెల్లో పెట్టుకున్నందుకు'

YS Sharmila comments on CM KCR : అయితే సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు షర్మిల తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం ఇటు కాంగ్రెస్ కానీ.. అటు షర్మిల కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్​లో తన పార్టీ విలీనం చేయాలనుకుంటే దానికి సానుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు చెప్పిన విషయం తెలిసిందే.

YS Sharmila Fires on LB Nagar Police : గిరిజన మహిళకు న్యాయం చేయాలంటూ షర్మిల రాస్తారోకో.. బలవంతంగా అరెస్ట్

Last Updated : Aug 31, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.