పెంపుడు శునకానికి బెలూన్లు కట్టి, గాలిలో తేలేలా చేసిన దిల్లీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ శర్మ అరెస్టయ్యాడు. జంతు హింస కింద 'పీపుల్ ఫర్ యానిమల్స్ సొసైటీ' ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబ్ వీడియో కోసం..
మాలవీయ నగర్‌కు చెందిన గౌరవ్.. తన తల్లితో కలిసి ఓ యూట్యూబ్ వీడియో కోసం పెంపుడు శునకానికి హీలియం బెలూన్లు కట్టాడు. అనంతరం గాలిలో తేలేలా చేశాడు. మే21న వీడీయోను యూట్యూబ్‌లో పెట్టాడు. అనంతరం ఈ వీడీయో వైరల్ కాగా, స్పందించిన 'పీపుల్ ఫర్ యానిమల్స్ సొసైటీ'.. శునకం ప్రాణాలను ఫణంగా పెట్టాడంటూ అతడిపై కేసు నమోదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అనంతరం యూట్యూబ్‌లో పెట్టిన వీడియోను గౌరవ్ తొలగించాడు. క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్టు చేశాడు. కాగా, అప్పటికే ఆ వీడియో వైరల్ అయ్యి అతడి అరెస్టుకు దారితీసింది.
ఇదీ చూడండి: పెంపుడు శునకాన్ని కారుకు కట్టి.. ఈడ్చుకెళ్లి..