Youths Padayatra To Get Bride : కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మలే మహదేశ్వర కొండకు వందలాది మంది యువకులు పాదయాత్ర చేపట్టారు. తమకు త్వరగా పెళ్లి జరిగేలా చూడమని మహదేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. వివాహం కాని యువకులు.. నడుచుకుంటూ కొండపైకి వెళ్లి దేవుడ్ని ప్రార్థిస్తే త్వరలోనే పెళ్లి సంబంధం కుదురుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
నాలుగు రోజులు.. 160 కిలోమీటర్లు..
Padayatra For Marriage Purpose : చామరాజనగర్ జిల్లాలోని కోడహళ్లి గ్రామానికి చెందిన పెళ్లి కాని సుమారు 100 మంది యువకులు దాదాపు నాలుగు రోజుల పాటు 160 కిలోమీటర్లు నడిచి వచ్చి మహదేశ్వరుని దర్శనం చేసుకున్నారు. కొండపైకి వెళ్లి సామూహికంగా ప్రత్యేక పూజలు చేశారు. "ప్రస్తుత రోజుల్లో రైతులు, కూలీల పిల్లలకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు. అందుకే పాదయాత్రగా వచ్చి పెళ్లి జరగాలని మహదేశ్వరునికి పూజలు చేశాం. దేశంలో వర్షాలు కురవాలని ప్రార్థించాం" అని కోడహళ్లి గ్రామానికి చెందిన యువకులు తెలిపారు.
11ఏళ్ల క్రితం 20 మంది.. ఇప్పుడు వందల సంఖ్యలో..
Unmarried Men Padayatra : "పెళ్లి కాని యువకులు ఏటా చేస్తున్న ఈ పాదయాత్ర.. 11 ఏళ్ల క్రితం 20 మందితో ప్రారంభమైంది. ఇప్పుడు వందలాది మంది యువకులు.. నడచుకుంటూ వచ్చి పెళ్లి త్వరగా జరగాలని మహదేశ్వరునికి పూజలు చేస్తున్నారు" అని నర్సీపుర్ గ్రామానికి చెందిన మరో యువకుడు తెలిపాడు.
పెళ్లి కాని యువకులే ఎక్కువ!
Bachelors Padayatra For Marriage : కార్తిక మాసంలో చామరాజనగర్, మైసూరు, మండ్య, బెంగళూరు సహా పలు జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు.. ఏటా మలే మహదేశ్వర కొండకు పాదయాత్రగా వెళ్తారు. అందులో పెళ్లి కాని యువకులే ఎక్కువగా ఉంటారు. తమకు త్వరగా పెళ్లి కావాలని ప్రార్థిస్తారు. దేశంలో భారీ వర్షాలు కురిసి సుభిక్షంగా పంటలు పండేలా చూడమని దేవుడిని భక్తులు వేడుకుంటారు. ఉద్యోగాలు లేని యువత కూడా మహదేశ్వరుడిని కొలుస్తారు.