Youth Murder In Kottayam: కేరళ కొట్టాయంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని కొట్టి చంపాడు జోమోన్ అనే రౌడీ షీటర్. అంతేగాకుండా చనిపోయిన తరువాత ఆ వ్యక్తి మృతదేహాన్ని భుజాల పై మోసుకువచ్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ ముందు పడేసి.. తానే చంపినట్లు పెద్దగా అరిచి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసి.. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ జరిగింది...
జోమోన్ అనే ఓ రౌడీ షీటర్.. పాత కక్షలతో శ్యాంబాబు అనే యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం శ్యాంబాబును కిడ్నాప్ చేసిన జోమోన్.. చిత్రహింసలకు గురి చేశాడు. కొట్టాయం లోని చాలా ప్రాంతాలకు ఆటోలో తిప్పాడు. చివరకు అతను చనిపోయాడని భావించి పోలీస్ స్టేషన్ ముందు పడేసి లొంగిపోయాడు.
జోమోన్ ఇప్పటికే పలు కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినప్పుడు అతడు మద్యం, గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: