ETV Bharat / bharat

Young Woman Suicide at Lanco Hills : సినిమాల్లో అవకాశాల పేరిట కన్నడ నటుడి దారుణాలు.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

author img

By

Published : Aug 14, 2023, 12:07 PM IST

Young Woman Suicide at Lanco Hills : పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తెెచ్చినా.. మహిళలను వేధించే వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. తాజాగా ఓ నటుడి కుమార్తె ఆలనా పాలనా చూసేందుకు పనిలో చేరిన యువతి.. ఆ ప్రబుద్ధుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని మణికొండలో చోటుచేసుకుంది.

Manikonda Bindhusri update
Young Woman Commits Suicide

Young Woman Suicide at Lanco Hills : హైదరాబాద్​లోని మణికొండ సమీపంలోని ల్యాంకోహిల్స్‌ పేరు వినగానే మీ అందరికీ.. నిత్యం కాపలా ఉండే భద్రతా సిబ్బంది.. చుట్టూ సీసీ కెమెరాలు గుర్తుకువస్తాయి. కానీ స్థానికులకు ఇంతటి కట్టుదిట్టమైన రక్షణ చర్యలున్నా లోపల జరుగుతున్న దారుణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే అక్కడ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మణికొండ ల్యాంకోహిల్స్‌(Manikonda Lanco Hills) అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ యువతి 21వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం రేపింది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం(Rayadurgam Police Station) పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Kannada Film Actor Cheating in the Name of Film Offers : స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పది సంవత్సరాల క్రితం హైదరాబాద్​ నగరానికి వచ్చి బంజారాహిల్స్‌ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మణికొండ ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌ 15 ఎల్‌హెచ్‌ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె బాగోగులు చూసుకోవడం కోసం కాకినాడకు చెందిన బిందుశ్రీ(Caretaker Bindhu Sri Commits Suicide) అనే యువతి పదేళ్లుగా కేర్‌ టేకర్‌గా పని చేస్తోంది. అదే అపార్ట్​మెంట్​లో తనకు కేటాయించిన గదిలో ఉంటూ పూర్ణచందర్​రావు కూతురి ఆలనా పాలనా చూసుకుంటోంది. అలా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Young Woman Committed Suicide by Jumping from 21st Floor : కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దాంతో పూర్ణచంద్‌రావు కుమార్తెను సాకేందుకు 5 రోజుల క్రితం మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీ 21వ అంతస్తు పైనుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్‌రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. నింపాదిగా అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు.

పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి కన్నడ నటుడి చీకటి కార్యకలాపాలు..: మృతురాలి తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. కన్నడ సినిమాల్లో(Kannada Actor Poornachanderrao) నటించానంటూ పూర్ణచంద్‌రావు ప్రచారం చేసుకునేవాడు. సినీ పరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశ చూపేవాడని పోలీసులకు స్థానికులు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. తొలుత అనుమానాస్పద మరణంగా భావించిన పోలీసులు నిందితుడి వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. పూర్ణచంద్‌రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sexual Assault Hyderabad : తల్లితో సహజీవనం.. కుమార్తెపై లైంగిక వేధింపులు.. చివరికి..!

లిఫ్ట్‌లో మైనర్​పై డెలివరీ బాయ్ లైంగిక వేధింపులు.. అత్యాచారం చేసిన 'ఆమె' స్నేహితుడు!

'నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను'.. జిల్లా కలెక్టర్​

For All Latest Updates

TAGGED:

Crime News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.