ETV Bharat / bharat

ఐటీ ఉద్యోగం వీడి.. సేంద్రీయ సాగులోకి.. - సేంద్రీయ రైతుగా మారిన ఐటీ ఉద్యోగి

వ్యవసాయం చేసేందుకు మగవాళ్లే అయిష్టం చూపుతున్న ఈ రోజుల్లో.. ఓ యువతి సేంద్రీయ వ్యవసాయం చేస్తూ లక్షలు అర్జిస్తోంది. అందులోనూ కరవుతో కొట్టుమిట్టాడే వ్యవసాయ భూముల్లో పంట సాగు చేస్తోంది. యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరు ఆ యువతి? ఆమె ఎంత సంపాదిస్తోంది? ఇంతకి ఆ ప్రాంతం ఎక్కడ?

Young woman leaves job for Organic farming
ఐటీ ఉద్యోగం వదిలి.... వ్యవసాయంలోకి యువతి
author img

By

Published : Jan 30, 2021, 7:57 PM IST

Updated : Mar 18, 2021, 1:37 PM IST

ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం మొదలుపెట్టిన యువతి

నిరంతరం కరవులో కొట్టుమిట్టాడే ప్రాంతం అది. అనుభవమున్న రైతులు సైతం అలాంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేసేందుకు మొహం చాటేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తానని పట్టుపట్టింది. అందులోనూ సేంద్రీయ సాగు పద్ధతిని అనుసరించి మంచి ఫలితాలను చూపిస్తానని ఛాలెంజ్​ చేసింది. ఇందుకోసం తల్లితండ్రులను ఒప్పించి మరీ ఐటీ ఉద్యోగాన్ని వీడింది. ఫలితంగా... వ్యవసాయం ద్వారా లక్షలు సంపాదిస్తూ యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమే కర్ణాటక చిత్రదుర్గ జిల్లా ద్రోణహళ్లి గ్రామానికి చెందిన రోజారెడ్డి.

ఆ రోజుల్లోనే..

చదువుకుంటున్న రోజుల్లోనే రోజారెడ్డికి వ్యవసాయంపై మక్కువ పెరిగింది. అయితే.. తల్లిదండ్రుల ఒత్తిడితో ఐటీ ఉద్యోగంలో చేరింది. ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయంపై పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్​డౌన్​ను... వ్యవసాయం చేయాలనే తన ఆశకు బాసటగా మార్చుకుంది.

ఉద్యోగం మానేసిన తర్వాత.. తనకున్న 6 ఎకరాల భూమిలో 35 రకాల కూరగాయలను పండిస్తోంది రోజారెడ్డి. ఇలా రోజుకు దాదాపు రూ. 10వేల వరకూ అర్జించడం మొదలుపెట్టింది. ఈ కూరగాయల సాగు కోసం బెళగావితో పాటు మహారాష్ట్ర నుంచి విత్తనాలు తెప్పించినట్లు చెబుతోంది.

యాప్​ కూడా....

నీటి కోసం తిప్పలు పడకుండా ముందుగానే పొలంలో బోరు బావి వేయించింది రోజారెడ్డి. తర్వాత నీరు వృథా కాకుండా పొలంలో డ్రిప్​ ఇరిగేషన్​ పద్ధతిని ఏర్పాటు చేసింది. సేంద్రీయ ఎరువులు ఉపయోగిస్తూ... కూరగాయలు పండిచడమే కాక వివిధ రకాలు పూల మొక్కలనూ పెంచుతోంది.

ఇలా పండించిన కూరగాయలు అమ్మేందుకు రోజారెడ్డి... ఒక మొబైల్​ యాప్​ను కూడా అభివృద్ధి చేసింది. బెంగళూరు​, ఉడుపి ప్రాంతాలకు ఈ కూరగాయలను సరఫరా చేస్తోంది. వటితో పాటు సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన పెంచేందుకూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయల వల్ల కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పద్ధతిని అవలంభిస్తున్నానని రోజా చెబుతోంది. ఆన్​లైన్​ ఆర్గానిక్​ మార్కెటింగ్​ కంపెనీ ఏర్పాటు చేయడమే లక్ష్యమని అంటోంది.

ఇదీ చదవండి:'రైతులకు ఒక్క ఫోన్​కాల్​ దూరంలో ప్రభుత్వం'

Last Updated : Mar 18, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.